Home » లవ్ జిహాద్ బిల్లుకు ఓకే చెప్పేసిన యూకే గవర్నర్
Published
2 months agoon
By
subhnUP Governor: ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పేశారు. ఈ చట్టం శనివారం (2020 నవంబర్ 28) నుంచి అమల్లోకి వస్తుందని క్లియర్ చేశారు. చట్టానికి వ్యతిరేకంగా మత మార్పిడి చేయడాన్ని నిషేదించే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని అధికారిక సమాచారం. వారం ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం వ్యక్తం చేసింది.
నిజాయతీ లేని పెళ్లిళ్ల మార్పిడి జరిగితే పదేళ్ల పాటు జైలు శిక్ష తప్పనిసరి. దీని ప్రకారం.. ఆ పెళ్లి చెల్లదు లేదా జరగలేదని పరిగణిస్తారు. ఒకవేళ పెళ్లి తర్వాత మతాన్ని మనస్ఫూర్తిగా మార్చుకోవాలి అనుకుంటే జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర అప్లై చేసుకోవాలి.
ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్లు ఈ చట్టాన్ని ఆమోదించాలనే ఉద్దేశ్యాన్ని బయటపెట్టాయి. పెళ్లి పేరుతో హిందూ యువతులని ఇస్లాంలోకి మారుస్తున్నారంటూ దీనికి లవ్ జిహాద్ అని పేరు పెట్టారు. ఇదంతా బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ప్లాన్ చేస్తుందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.