లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

ఇంటికి నిప్పంటించిన దుండగులు..స్నేహితుడితో సహా జర్నలిస్ట్ సజీవదహనం

Published

on

up journalist burnt to death in balrampur : ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ పట్టణంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ జర్నలిస్ట్ ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో జర్నలిస్టును సజీవ దహనం అయ్యాడు. బలరాంపూర్‌లోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడుతో కలిసి ఓ ఇంటిలో నివసిస్తున్నాడు. ఈక్రమంలో కొంతమంది దుండగులు అతను ఉంటున్న ఇంటికి నిప్పంటించారు.ఈ ఘటనలో జర్నలిస్టు రాకేష్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో రాకేశ్ సింగ్ భార్య, పిల్లలు ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులు ప్రాణాలను దక్కించుకోగలిగారు.ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమచారం అందించటంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి బాధ్యులుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నాలుగు పోలీసులు బృందాలను అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని విచారిస్తున్నారు.

పొలంలో పనిచేస్తున్న 43మంది కూలీల గొంతు కోసి చంపేసిన తీవ్రవాదులు
మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జిల్లా అధికారులు మృతుడి భార్యకు అందించారు. అలాగే, బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్ట్ భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *