లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

10 పెళ్లిళ్లు, ముగ్గురు లేచిపోయారు, 5 గురు చనిపోయారు…ఇద్దరితో జీవనం – ఆస్తి కోసం హత్య

Published

on

UP man, 52, who married 10 times murdered over property :  ఉత్తర ప్రదేశ్ లోని బరేలి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం 52 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారు. ఇప్పటి కే 10 సార్లుపెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ప్రస్తుతం ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. ఆస్తి కోసమే బంధువులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

బరేలి జిల్లాకు చెందిన జనగన్ లాల్ యాదవ్(52) 1990 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఇతని భార్యల్లో ఐదుగురు అనారోగ్య కారణాలతో చనిపోగా, ముగ్గురు వేరే వాళ్లతో లేచిపోయారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలతో (30సం, 40 సంవత్సరాలు) కలిసి జీవిస్తున్నాడు. వారిద్దరూ పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు.

ఇద్దరి భార్యల్లోని, ఒక భార్యకు మొదటి భర్త ద్వారా కలిగిన కుమారుడు(24) కూడా వీరితో కలిసి నివసిస్తున్నాడు. కాగా బుధవారం జనవరి 20వ తేదీన జగన్ లాల్ ఊరికి దగ్గరలోని పంట పొలంలో జగన్‌లాల్‌ శవమై తేలాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్తికోసమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భోజిపుర పోలీసులు తెలిపారు.

కేసు విచారణ చేస్తున్న స్ధానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… జగన్ లాల్ కు మెయిన్ రోడ్డు ప్రక్కనే విలువైన స్ధలం ఉంది. దానికి మార్కెట్ లో మంచి ధర పలుకుతోంది. ఆ ఆస్తిని దక్కించుకోడానికే జగన్ లాల్ హత్య జరిగి ఉంటుందని బావిస్తున్నామని చెప్పారు. జగన్ లాల్ పెళ్ళి మీద పెళ్లి చేసుకుంటూ ఉండటంతో అతని తండ్రి ఎక్కువ భాగం ఆస్తి అతని అన్న పేర రాశాడు.

జగన్ 10 పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలు కలగలేదు. ఒక భార్యకు మొదటి భర్తద్వారా పుట్టిన కొడుకు వీరితో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి ఆస్తి మొత్తం అన్న పేరుతో రాయటంతో జగన్ ఆస్తి గురించి పంచాయతీ పెట్టి కొంత ఆస్తిని దక్కించుకోగలిగాడు. ఆ ఆస్తి గురించే బంధువులు హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల వాంగ్మూలం రికార్డు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.