Home » సోదరితో అసభ్యకర స్థితిలో ఉన్న బంధువును కొట్టిన అన్న.. ప్రతీకారంతో అతడ్నే చంపేశారు!
Published
5 months agoon
By
sreehariఇంట్లో తన సోదరితో అసభ్యకర స్థితిలో ఉండటం చూసి బంధువును ఆమె సోదరుడు అతన్ని కొట్టి గట్టిగా మందిలించాడు.. తనను కొట్టాడనే కోపంతో అతడిపై బంధువు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం.. బయటకు పిలిచిన బంధువు అతన్ని కాల్చి చంపేశాడు.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని పిలువా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్పూర్ గ్రామంలో జరిగింది.
20 ఏళ్ల యువకుడు తన బంధువును హత్య చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మృతుడు మహ్మద్ హసీన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారం క్రితం.. తన సోదరి బంధువు మహ్మద్ సీన్‘అభ్యంతరకరమైన స్థితిలో’ఉండటం చూసిన సోదరుడు మహ్మద్ ఫైజాన్ ఆగ్రహంతో ఊగిపోయాడు.. తరువాత అతను ఫైజాన్ను కొట్టాడు.
హసీన్ ఇంటికి వచ్చిన ఫైజాన్.. మాట్లాడదామంటూ బయటకు పిలిచాడు.. హసీన్ బయటికి రాగానే అతన్ని కాల్చి చంపాడు. హసీన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఐపిసి లోని సెక్షన్ 302 కింద అతడిపై హత్య కేసు నమోదైంది. తనను కొట్టాడనే కోపంతోనే పైజాన్.. హసీన్ను కాల్చి చంపేశాడని పోలీసులు విచారణలో తేలింది. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.