లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

బాలికకు భూస్వామి కొడుకు వేధింపులు..పోలీసుల నిర్లక్ష్యం..నిప్పుల్లో కాలిపోయిన పేదింటి బిడ్డ

Published

on

Up 15 years girl fire kills herself : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నేరం జరిగింది అంటే యూపీలోనా అనేలా తయారైంది. పసిపిల్లల నుంచి వృద్ధురాలి వరకూ జరిగే హత్యలు..అత్యాచారాలకు అదుపులేకుండాపోతోంది. ఈ క్రమంలో ఓ బాలికపై ఓ పెద్దింటి కుర్రాడు వేధింపులకు ప్రాణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసులకు చెప్పినా ఎటువంటి ఫలితం దక్కకపోగా వేధింపులు మరింతగా పెరిగాయి. ‘‘నిన్ను వేధించటమే కారు రేప్ చేస్తా..నువ్వే చేస్తావ్..నీకెవరు దిక్కు..నన్నెవడేం చేస్తాడు? అంటూ విర్రవీగే ఆ దురహంకారానికి 15 బాలిక బలైపోయింది. మంటల్లో కాలి బూడిదైపోయింది.

వివరాల్లోకి వెళితే..అది నేరాలకు అడ్డాగా మారిన ఉత్తప్రదేశ్ రాష్ట్రం. మీర్జాపూర్ జిల్లా. ఓ 15 ఏళ్ల బాలిక రోజూ స్కూలుకు వెళ్లేది. తరువాత.. కోచింగ్ క్లాసులకూ వెళ్తోంది. ఈక్రమంలో బాగా బలిసిన ఓ కుర్రాడు. ఆమె వెంట పడేవాడు. అసహ్యంగా మాట్లాడేవాడు. నీ వయస్సెంతా వయస్సు మించి మాంచి ఏపుగా పెరిగావ్..నా దగ్గరకొస్తావా? అంటూ వేధించేవాడు.

ఆ ఏరియాలో జన సంచారం తక్కువ కావడంతో… అడ్డమైన వెధవ్వేషాలూ వేసేవాడు. మాటలతో సరిపెట్టకుండా పట్టుకునేవాడు. ఎక్కడెక్కడో చేతులు వేస్తూ…తీవ్రమై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దీంతో ఓ పక్క భయం మరోపక్క ఏంచేయాలో తెలీయని ఆందోళనతో ఆ బాలిక మానసికంగా శారీరకంగా నలిగిపోయేది.

నేను చదువుకోవాలనుకుంటున్నాను..దయచేసి నా జోలికి రావద్దని చేతులెత్తి దణ్ణం పెట్టేది. బతిమాలేదు. ఓ సారి ధైర్యం చేసి నా జోలికి వస్తే..మా నాన్నతో చెబుతాను..పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అంతే వాడు రెచ్చిపోయాడు. ‘‘ఎవడే నిన్ను నానుంచి కాపాడేది. మీ నాన్న అంత పెద్ద మగాడా? నేను తలచుకుంటే నిన్ను ఇప్పుడే రేప్ చేస్తా..ఏం చేస్తావ్..పోలీసులకు చెబితే వాళ్లేం చేస్తారు?నన్నేం పీకుతారు? అంటూ శివాలెత్తిపోయాడు.

అప్పటినుంచి వేధింపులు ఎక్కువయ్యాయి..పట్టుకోవటం..నలిపేయటం..నిన్నెప్పటికైనా అనుభవిస్తానంటూ రెచ్చిపోయేవాడు. పాపం ఆ బాలిక హడలిపోయేది. వణికిపోయేది. దీంతో ఓ రోజు తన తండ్రికి జరిగిందంతా చెప్పి భోరుమని ఏడ్చింది.

ఎన్నిసార్లు చెప్పినా ఆ అబ్బాయి తీరు మార్చుకోలేదు. దాంతో… బాధితురాలు… తన తండ్రికి విషయం చెప్పింది. ఆ కుర్రాడి ఇల్లు అక్కడికి దగ్గర్లోనే ఉంది. ఆమె తండ్రి వెళ్లి… ఆ కుర్రాడికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో… ఆ కుర్రాడు మరింత రెచ్చిపోయాడు. “నాపైనే చెబుతావా… నిన్ను రేప్ చేస్తా… ఏం చేస్తావ్” అంటూ మరింతగా వేధించడంతో… మరోసారి తండ్రికి చెప్పింది.

అది విన్న తండ్రికి ఆవేశం..ఆవేదన రెండూ కలిగాయి..నా బంగారు తల్లీ ఇప్పటి వరకూ నాకెందుకు చెప్పలేదు అని కూతుర్ని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి… ఆ కుర్రాడిపై కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రాసిన పోలీసులు… మేం చూసుకుంటాం… మీరు నిశ్చిత్తంగా ఇంటికి వెళ్లండి అన్నారు. కానీ…వాళ్లు చూసిందీ లేదీ చేసిందీ లేదు. అలా నెల రోజులు గడిచాయి.

పోలీసుల నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసిన ఆ కుర్రాడు మరింతగా రెచ్చిపోయాడు వేధింపులకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. మరింత అసహ్యంగా ప్రవర్తించసాగాడు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. చివరకు చావే శరణ్యం అనుకుంది.

తల్లిదండ్రులు ఇంటికి కాస్త దూరంలో ఉన్న సమయంలో… ఇంట్లో మంటలు కనిపించాయి. చూసి ఆశ్చర్యపోయిన తండ్రి అగ్ని ప్రమాదం అనుకుంటూ.. ఇంటికి పరుగులు పెట్టాడు. తీరా ఇంటికొచ్చి చూస్తే… మంటల్లో కాలిపోతూ కూతురు కనిపించింది.

మంటల్లో కాలిపోతున్న కూతుర్ని ఏడుస్తూ..ఆమెపై ఓ దుప్పటి కప్పి… మంటల్ని ఆర్పివేశారు. అప్పటికే ఒళ్లంతా కాలిపోయింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. చిన్నారికూతుర్ని చక్కగా చదివించి ఉన్నత స్థాయికి చేర్చాలనుకున్న కన్నవారి కలలు ఓ పెద్దింటి కుర్రాడి పొగురుకు బలైపోయాయి.

దీనంతటికీ కారణం పోలీసులే అని ఆ తండ్రి ఆవేదనతో ఆరోపించారు. ఆ కుర్రాడు… ఓ భూస్వామి కొడుకు కావడం వల్లే పోలీసులు యాక్షన్ తీసుకోలేదని బాలిక తాతయ్య ఆరోపించారు. పోలీసులు ఉన్నవాళ్లకేనా..మాబోటివాళ్లకు కాదా? వాళ్ల నిర్లక్ష్యానికి నా చిన్నారి చిట్టితల్లి కాలి బూడిదైపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.

దీనిపై పోలీసులను ప్రశ్నించగా… తమకు ఇప్పటివరకూ ఏ కంప్లైంటూ రాలేదనీ అబద్దాలాడి తప్పించుకున్నారు. కానీ ఆ బాలిక మరణానికి కారణం సదరు కుర్రాడని తెలిసి ఆ కుర్రాణ్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. అతను మైనర్ కాబట్టి… పేరు చెప్పట్లేదని తెలిపారు. కాగా ఆ గ్రామస్తులంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లనే బాలిక చనిపోయిందని అంటున్నారు. నెల కిందటే ఆ పిల్లాణ్ని అరెస్టు చేసి ఉంటే… ఇప్పుడామె ప్రాణాలు దక్కేవే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *