ఆడుకుంటూ విషపు పాముపిల్లను మింగేసిన పిల్లాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మా పిల్లాడు అస్సలు పేచీ పెట్టడు..బొజ్జనిండా పాలు తాగించి కూర్చోపెడితే చక్కగా ఆడుకుంటాడని తల్లులు మురిసిపోతుంటారు. కానీ ఆడుకునే పిల్లల్ని అలా వదిలేయకూడదు..వారు ఆడుకుంటూ ఆడుకుంటూ చేతికి అందిన వస్తువుల్ని నోట్లో పెట్టేసుకుంటారు.అలా పలు సందర్భాల్లో చిన్నారులకు ప్రాణాపాయం రావచ్చు..అదిగో అటువంటిదో ఓ బుజ్జాయికి వచ్చింది. చక్కగా ఆడుకుంటున్నాడు కదాని తల్లి తన పనిలో పడింది. మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉంది. కానీ జరగాల్సిన ప్రమాదం జరిగనే జరిగింది. ఆ బుజ్జాయి ఆడుకునే చోటికి ఓ పాము పిల్ల వచ్చింది. అలా వచ్చిన పాము పిల్లను పిల్లాడు చటుక్కున పట్టేసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. అది కొద్దిగా నోట్లోకి వెళ్లిపోయింది..అంతలో తల్లి పిల్లాడు ఏం చేస్తున్నాడోనని వచ్చి చూసేసరికి బిడ్డడి నోట్లో పాములాంటిది కనిపించేసరికి హడలిపోయింది..ఓరి దేవుడా..ఎంత పని జరిగింది అంటూ ఒక్క ఉదుటున పిల్లాడి దగ్గరకొచ్చి నోట్లో ఉన్న పాము పిల్లని బైటకు లాగేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బ‌రేలీ జిల్లాలోని భోలాపూర్ గ్రామంలో జరిగింది.


భోలాపూర్ గ్రామంలో ధర్మాపాల్,సోమ‌వ‌తి దంపతులకు అనే రైతు దంపతులకు ఏడాది వయసున్న దేవేంద్ర ఉన్నాడు. పిల్లాడికి పాలు పట్టించి ఆడుకోవటానికి ఇంటిలోనే కూర్చోపెట్టి పనులు చూసుకుంటోంది సోమవతి. అదే స‌మ‌యంలో ఎక్కడనుంచి వచ్చిందో గానీ.. ఓ విషపూరితమైన పాము పిల్ల అక్క‌డ‌కు వ‌చ్చింది. చిన్నారి పాకుతున్న ఆ పాము పిల్లను పట్టుకుని నోట్లో వేసుకున్నాడు. అదృష్టం బాగుండి తల్లి చూసి వెంటనే పరుగెత్తుకు వెళ్లి అత‌డి నోట్లోంచి ఆ పామును తీసేసింది. దీంతో చిన్నారి ప్రాణాపాయం తప్పింది.


ధర్మాపాల్ అనే రైతు ఆ బాలుడి నోట్లో నుంచి పామును తీసేసిన త‌ర్వాత త‌న భ‌ర్త ధ‌ర్మ‌పాల్‌తో క‌లిసి ఆ చిన్నారిని ఆసుప‌త్రికి తీసుకెళ్లింది తల్లి. పిల్లాడితో పాటు ఆ పాముని కూడా ఆసుప‌త్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూపించారు. వెంటనే ఆ బాలుడికి వైద్యులు యాంటీ-వెమోన్ ఇంజ‌క్ష‌న్ ఇచ్చారు. తరువాత ఎందుకైనా మంచిదని అబర్వేషన్ లో ఉంచి ఐసీయూలో 24 గంటలపాటు చికిత్స అందించారు.


ఈ దుర్ఘటనపై తండ్రి ధర్మపాల్ మాట్లాడుతూ..ఆడుకునే పిల్లాడి నోట్లో ఏదో ఉంద‌ని గుర్తించిన నా భార్య దాన్ని నోట్లోంచి బ‌య‌ట‌కు తీసింది. అది పాము అని గుర్తించి భ‌యంతో వ‌ణికిపోయింది. ఆ పాము అప్పటికే చ‌నిపోయింది. కానీ వెంటనే డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లటం వారు వెంటనే వైద్యం అందించటంతో నా బిడ్డడు ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాద‌మూ లేదని డాక్టర్లు చెప్పారని నాకొడుకు…మేము చాలా అదృష్టవంతులం కాబట్టే ప్రమాదం నుంచి బైటపడ్డాడని భయం..ఆనందం నిండిగా ధర్మపాలు చెప్పాడు.


దీనిపై డాక్టర్లు కూడా మాట్లాడుతూ..పిల్లాడు నోట్లో పెట్టుకున్న పాము ‘క్రైట్ హాచ్లింగ్’జాతికి చెందినది..చాలా విషపూరితమైనది..కానీ తల్లి వెంటనే చూసి పాముని బైటకు తీసేసిన వెంటనే హాస్పిటల్ కు తీసుకురావటంతో మేము వైద్యం చేయటంతో బాబుకి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

వరుడి ముందే కొత్త పెళ్లి కూతురుకు ముద్దు పెట్టిన ప్రియుడు

Related Posts