లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Priyanka Gandhiకి క్షమాపణ చెప్పిన UP Police

Published

on

యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఆదివారం Priyanka Gandhiకి క్షమాపణలు చెప్పారు. డీఎన్డీ ఫ్లై ఓవర్ దగ్గర కాంగ్రెస్ లీడర్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో కుర్తా పట్టుకున్న ఘటనపై ఎంక్వైరీకి ఆర్డర్లు వచ్చాయి.

ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ లీడర్లతో కలిసి హత్రాస్ కు ఆదివారం బయల్దేరారు. శనివారం మధ్యాహ్నం గ్యాంగ్ రేప్ కు గురై 20ఏళ్ల యువతి చనిపోయిన ఘటన తెలుసుకుని అక్కడకు వెళ్లేందుకు బయల్దేరారు. అప్పుడే కాంగ్రెస్ వర్కర్లు, ప్రియాంక గాంధీపై గౌతం బుద్ధ నగర్ పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు.ఈ ఘటనలో హెల్మెట్ పెట్టుకున్న పోలీస్ అధికారి 48సంవత్సరాల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుర్తా పట్టుకుని లాగారు. ‘నోయిడా పోలీసులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మేమంతా ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్తున్నాం’ అని చెప్పారు.

ఘటనను సుమోటాగా తీసుకుని విచారిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) వెల్లడించారు. దీనిని సీనియర్ లేడీ ఆఫీసర్ ఇంక్వైరీ చేస్తారని తెలిపారు. అంశంపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు.

ఆ ఘటనపై ఫొటోలతో పాటు వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారి పోలీసుల ప్రవర్తనపై విమర్శలకు దారితీశాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *