Home » దొంగలతో కలిసి..నగల షాపు లూటీ చేయించిన పోలీసులు : కంచె చేను మేయటమంటే ఇదేనేమో
Published
1 month agoon
UP police robbery : వాస్తవాలనుంచే సామెతలు పుడతాయి.పెద్దలు అనుభవంతో సామెతల రూపంలో వాస్తవాలను చెబుతుంటారు. కంచే చేను మేస్తే అనే సామెతను నిజం చేసి చూపించారు యూపీ పోలీసులు. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా మారారు. దోపిడీ దొంగలతో చేతులు కలిపి ఏకంగా నగల షాపుకే కన్నవేశారు. రూ.35లక్షలకుపైగా విలువైన నగల్ని దోచేశారు. పాపం పండి దొరికిపోయి..పోలీసుల డిపార్ట్ మెంట్ పరువును నడిరోడ్డుమీద పెట్టాశారు ఉత్తరప్రదేశ్ లోని పురానీ బస్తీ పోలీసులు.
ఉత్తరప్రదేశ్ లోని పురానీ బస్తీ పోలీసులు దొంగలతో చేతులు కలిపి ఏకంగా ఓ నగల దుకాణాన్ని లూటీ చేశారు. రూ.35 లక్షల విలువైన ఆభరణాలను దోచుకుని దొంగలకు తామేమీ తీసిపోమని నిరూపించుకున్నారు. పురానీ బస్తీ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై ధర్మేంద్ర యాదవ్, మహేందర్ యాదవ్, సంతోష్ యాదవ్ అనే కానిస్టేబుళ్లు దొంగలతో చేతులు కలిపారు. ఎక్కడెక్కడ దోపిడీలు చేయాలి? ఎలా చేయాలి? అని పక్కాగా ప్లాన్ వేశారు. అలా వేసిన ప్లానును గుట్టు చప్పుడు కాకుండా అమలు చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం మహరాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ నగల దుకాణాన్ని టార్గెట్ చేసి దోపిడీ చేశారు. అందినకాడికి బంగారు, వెండి ఆభరణాలు దోచుకుపోయారు.
తన షాపులో దోపిడీ జరిగిందని తెలుసుకున్న యజమాని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆ దోపిడీకి కారణం తమ డిపార్ట్ మెంట్ కు చెందినవారేనని తెలిసి షాక్ అయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఉన్నతాధికారులు ఆ ఎస్సైని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురే కాదు, మరో 9 మంది పోలీసులకు కూడా ఈ దోపిడీతో సంబంధం ఉందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దోపిడీకి వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
శ్రుతి అరెస్ట్.. పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి ఏకంగా రూ.11కోట్లు కొట్టేసిన కిలేడీ
ఫ్రెండ్‌కి బైక్ ఇచ్చిన పాపానికి జైలుకెళ్లిన విద్యార్థి, మీరు ఇలాంటి తప్పు చేయొద్దు
యూపీలో చాట్ వ్యాపారుల అరాచకం : కస్టమర్ల కోసం కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టుకున్నారు
వాహనాలపై ఇష్టమొచ్చిన రాతలు రాసుకుంటే జేబులు ఖాళీయే..
పెట్రోల్ ధరల పెంపుపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
కొకైన్‌తో పట్టుబడ్డ బీజేపీ యువ మోర్చా లీడర్లు