లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

హత్రాస్ డ్రామా.. యూపీ పోలీసుల ఘర్షణలో కార్యకర్తలకు అండగా ప్రియాంకా వాద్రా

Published

on

Hathras Drama : UP Police vs Priyanka Gandhi Vadra : హత్రాస్ డ్రామా.. యూపీ రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (DND) ఫ్లైఓవర్‌లోని టోల్ ప్లాజాలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఉత్తర ప్రదేశ్ పోలీసుల మధ్య శనివారం మధ్యాహ్నం ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు గాయపడ్డాడు. హత్రాస్ బాధితురాలి కుటుంబానికి పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ఘర్షణ జరగడంతో ప్రియాంక, రాహుల్ అక్కడే ఆగిపోయారు. ముదురు నీలం కుర్తా, మాస్క్ ధరించిన ప్రియాంకా వాద్రాతో పాటు రాహుల్ తెల్లని కుర్తా ధరించి ఉన్నారు. పోలీసులతో ఘర్షణలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు.

UP Police vs Priyanka Gandhi Vadra In Hathras Drama

ప్రియాంకా వాద్రా గాయపడిన వ్యక్తిని సాయంగా ముందుకు వచ్చారు. డిఎన్‌డిలోని టోల్ ప్లాజా వద్ద హత్రాస్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు. సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు.ఇదివరకే హత్రాస్ వెళ్లేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కానీ, పోలీసులు అనుమతించలేదు. కరోనావైరస్ ఆందోళనల మధ్య బహిరంగ సమావేశాలను పోలీసులు నిషేధించారు. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాహుల్, ప్రియాంక సహా ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలను హత్రాస్ వెళ్లేందుకు అనుమతినిచ్చింది.


మహిళలపై నేరాలను నిరోధించలేక పోవడంపై బిజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. కాంగ్రెస్ నిరసనలను రాజకీయ స్టంట్ అంటూ  బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాజకీయ లాభం కోసమే రాహుల్ గాంధీ హత్రాస్ పర్యటన చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *