లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ప్రేమిస్తే చంపేస్తారా?ఖాప్‌ పంచాయితీల దురాగతాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Published

on

UP : falling love crime supreme court comments : ప్రేమిస్తే చంపేస్తారా? అంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రేమలో పడినందుకు ప్రాణాలు తీసేయటం.. సరికాదనీ..ఈ కారణంగా ఏ వ్యక్తినీ శిక్షించే అర్హత ఎవరికీ లేదంటూ సుప్రీంకోర్టు మరోమారు తేల్చి చెప్పింది. ప్రేమలో పడినందుకు శిక్షించటం..ప్రాణాలు తీయటం అత్యంత హేయమైన చర్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించి, జీవితాన్ని పంచుకోవాలని..వారితోనే కలిసి జీవించాలని భావించిన యువతీయువకులను శిక్షించటం ప్రాణాలు తీయటం అనేది న్యాయస్థాన దృష్టిలో శిక్షార్హమైన నేరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే అన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అత్యంత దారుణమైన నేరమని ఓ పరువు హత్య కేసులో ఖాప్‌ పంచాయితీ సభ్యులు పెట్టుకున్న బెయిల్ పిటీషన్ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

పరువు పేరుతో ముగ్గురికి ఉరి వేసిన ఖాప్ పంచాయి పెద్దలు
ప్రేమలో పడ్డ ఓ జంట, ఇల్లు వదిలి పారిపోయారు. వారికి ఓ దళిత బాలుడు సహాయపడ్డాడు. పెద్దల కోపం చల్లారిందని భావించిన ఆ ప్రేమికులు తిరిగి ఊరికి రావడంతో సనాతనవాదులు వారిద్దరినీ, వారికి సాయపడిన బాలుడినీ చెట్టుకి వేలాడదీసి, ఉరివేశారు. ఉరితీసే ముందు ఈ ఇద్దరు బాలురి మర్మాంగాలను కాల్చివేయడం ఆటవిక సమాజపు ఆనవాళ్ళను తలపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా మెహ్రాణా గ్రామంలో 1991లో జరిగింది.

‘‘మెహ్రానా పరువు హత్యలు’’ : ఖాప్‌ పంచాయితీల క్రూరత్వం…
1991లో ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలోని ‘‘మెహ్రానా పరువు హత్య’’ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఈ వ్యాఖ్యలు చేసింది. ఖాప్ పంచాయితీల దురాగతాలను ప్రశ్నించింది. ఇటువంటి నేరాలు చాలా దారుణమైన చర్యలని పేర్కొంది. ఇటువంటి నేరాలు కోర్టు దృష్టిలో శిక్షార్హమైన నేరాలను పేర్కొంది.

మోహ్రానా గ్రామంలో ప్రేమించుకొని, పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇల్లువదిలి పారిపోయిన బాలికను, ఆమె ప్రియుడినీ, వీరిద్దరికీ సాయపడిన మరో దళిత బాలుడినీ చెట్టుకి ఉరివేసి చంపిన నేరానికి ఎనిమిది మందికి కోర్టు మరణశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదుని విధించింది. ఆ తరువాత 2016లో అలహాబాద్‌ హైకోర్టు మరణశిక్ష ను కూడా జీవిత ఖైదుగా మార్చింది.

ఈ కేసులో ఖాప్‌ పంచాయితీకి చెందిన 11 మంది సభ్యులు బెయిలు కోసం పెట్టుకున్న పిటషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ.బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘మెహ్రాణా పరువు హత్య’’ఖాప్‌ పంచాయితీల నేరపూరిత వైఖరి దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ఈ కేసులో బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్‌లను ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తిరస్కరించింది.

దోషుల ప్రవర్తనపై రికార్డులపై అధికారులకు సుప్రీం ఆదేశాలు..
ఈ కేసుకు సంబంధించిన ఖైదీలతో ముఖాముఖి మాట్లాడాలని ఆగ్రా, మథుర సెంట్రల్‌ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. జైలులో దోషుల ప్రవర్తన ఎలా ఉంది? అనే అంశంపైరికార్డులను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. రిపోర్టులో శిక్షాకాలాన్ని కూడా నమోదుచేయాలని సూచించింది. వీటిని బట్టి ఖైదీల్ని బెయిలుపై విడుదల చేయడంవల్ల నష్టమున్నదా అనే విషయాన్ని పరిశీలించనుంది. వీటిన్నింటిని పరిశీలించిన తరువాత సదరు ఖైదీలకు చెయిల్ ఇవ్వాలా? లేదా? అనే విషయంపై ధర్మాసనం నిర్ణయించనుంది.