మంచి మగడు: నా భర్త ప్రేమను భరించలేకపోతున్నా..విడాకులు కావాలి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బంగారాంటి భర్త దొరకాలని ప్రతీ అమ్మాయి కలలుకంటుంది. పల్లెత్తు మాట అనకుండా గుండెల్లో చూసుకునే భర్త కావాలని కోరుకుంటుంది. కోపం వచ్చి కస్సుమన్నా ‘ఓకే బంగారం అలాగే నీ ఇష్టం’అంటూ లైట్ తీసుకునే మొగుడు..పొరపాటున తప్పు చేస్తే ఏం కాదులే మనిషిన్నాక తప్పు చేకుండా ఉంటారా? అని ఏ మొగుడైనా పట్టించుకోకుండా ఉంటాడా? ఉండడు. కానీ అటువంటి భర్త దొరకటం చాలా కష్టం..అందులోనే ఈ రోజుల్లో అయితే అది సినిమాల్లో కూడా ఉండడు.

కానీ ఓ యువతికి సరిగ్గా అటువంటి వ్యక్తే భర్తగా లభించాడు. కానీ..ఆ భార్య మాత్రం నా భర్త అతి ప్రేమను భరించలేను నాకు విడాకులు ఇప్పించడండీ సార్..అంటూ కోర్టెకెళ్లింది. బాబోయ్..ఇటువంటి మొగుణ్ని..నేను భరించలేను..కోపం రాదు..విసుక్కుంటే పట్టించుకోడు..తిడితే వినిపించుకోడు..అందంగా అలకరించుకున్నా బాగున్నావోయ్..అని ఒక్కమాట నోటినుంచి రాదు..కోపం వచ్చి తిట్టినా పట్టించకోడు.. ఆయన నాతో గొడవపడటం అనేది ఈ జన్మకు జరగదు. పైపెచ్చు గట్టిగా పల్లెత్తు మాటైనా అనరు. ఇటువంటి చప్పిడి మొగుడిని నేను భరించలేను..నాకు విడాకులు ఇప్పించండి మహాప్రభో అంటూ కోర్టుకెక్కింది ఉత్తర ప్రదేశ్‌లో సంభల్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ.

ఈ విచిత్రమైన విడాకుల కేసు యూపీ న్యాయవాదుల్ని..న్యాయమూర్తిని కూడా ఆశ్చర్యపరిచింది. ఈ కేసు గురించి..ఆమె భర్త మంచితనం గురించి చెబుతున్న విషయాలు తెలిస్తే ఎవ్వరైనా సరే ‘ఏంటీ దీనికేమన్నా పిచ్చా..ఇంత మంచి మొగుడు దొరకటం అదృష్టం..నెత్తిన పెట్టుకుని చూసుకోకుండా ఇలా కోర్టుకెక్కి విడాకులు అడగటమేంటీ..ఒళ్లుతెగబలిసి కాకపోతే’’ అని అనుకుంటారు.

వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్‌లో సంభల్ జిల్లాకు చెందిన ఓ యువతికి 18 నెలల క్రితం వివాహం అయ్యింది. పెళ్లి అయిననాటి నుంచి ఆమెను భర్త ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. పల్లెత్తు మాటకూడా అనలేదు. కానీ ఆమెకు భర్తతో సరదా చిలిపి తగవులు పెట్టుకోవాలని..తరువాత ఇద్దరూ చక్కగా మాట్లాడుకోవాలని..చిన్న చిన్న అలకలు కాపురంలో చక్కటి అనుభూతుల్ని కలిగిస్తాయని ఆశపడుతుంది. కానీ భర్త మాత్రం ఏమీ అనడు. వంట ఎంత రుచిగా చేసినా బాగుందని ఒక్కమాట అనడు. చక్కగా ముస్తాబైతే బాగున్నావోయ్ బేగం అని మెచ్చుకోడు. పెళ్లైన కొత్తలో కొత్త కదాని అనిపించేది. కానీ రాను రాను అలాగే ఉండటంతో ఆమె కావాలని భర్తతో గొడవ పెట్టుకునేది..కానీ భర్త మాత్రం ఏమీ పట్టించుకునేవాడు కాదు. దీంతో కావాలని తిట్టేది..విసిగించేది..నిర్లక్ష్యంగా మాట్లాడేది..కానీ భర్తనుంచి అదే స్థబ్తత. దీంతో ఇదేం మొగుడురా బాబూ..ఇంత చప్పిడి మొగుడేంటీ అని నెత్తి కొట్టుకునేది. కాపురంలో చక్కగా సరసాలే కాదు చిన్న చిన్న అలకలు..తిట్లు..విసుగులు..విసురులు ఉంటేనే బాగుంటుంది కానీ ఇదేందిరా బాబూ అనుకోవటంతో రోజులు..వారాలు నెలలు గడిచిపోయాయి. కానీ భర్తలో ఎటువంటి మార్పూ లేదు. అదే అడిగితే నిన్ను ఏమన్నా అనటం కూడా నాకిష్టం ఉండదు అంటాడు..!!

READ  ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్

అలా 18 నెలలు గడిచిపోయాయి. దీంతో ఆమె ‘నా భర్త నా మీద కురిపిస్తున్న ప్రేమను తట్టుకోవడం నావల్ల కావడంలేదు. ఆయనగారి అతి ప్రేమను భరించడం నావల్ల కాదు. ఆయన నాతో గొడవపడటం అనేది ఈ జన్మకు జరగదు. పైపెచ్చు గట్టిగా పల్లెత్తు మాటైనా అనరు. నాకు ఆయనతో గొడవ పడాలని ఉంది. ప్రతి దానికి ఇలా ఎటువంటి స్పందనా లేకుండా జడపదార్ధంలాగా ఉంటే బాగుండటంలేదు..అన్నింటికీ సర్దుకుపోయే ఇలాంటి మొగుడితో జీవితం నాకొద్దు. ఒక మెచ్చుకోలు లేదు, ఒక విమర్శా లేదు. తిట్టడు..తిట్టినా పట్టించుకోడు..ఇలాంటి వాతావరణం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే నాకు విడాకులు ఇప్పించండి’ అంటూ షరియా కోర్టుకు విన్నవించుకుంది.

తన భర్త అప్పుడప్పుడు వంట చేస్తుంటాడని.. ఇంటి పనుల్లో తనకు సాయం చేస్తుంటాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై కోర్టు ఆమె భర్తను వివరణ కోరింది. దానికి ఆ మంచి భర్త మాట్లాడుతూ..‘నా భార్యను ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నా. అందుకే నాకు ఆమెను ఒక్క మాట కూడా అనాలనిపించదు’ అని సమాధానం ఇచ్చేసరికి సదరు కోర్టులో న్యాయవాదులతో పాటు న్యాయమూర్తి కూడా నోరెళ్లబెట్టారు. అంతేకాదు నా భార్య ఇచ్చిన ఈ విడాకుల ఫిర్యాదును కోర్టు అంగీకరించొద్దని..నా భార్యను నేను వదులుకోలేనని కూడా సదరు భర్త కోర్టును అభ్యర్థించాడు.

దీంతో అతడి కోరికను మన్నించిన షరియా కోర్టు.. విడాకుల ఫిర్యాదును తిరస్కరించింది. ఇద్దరూ కలిసి శాంతంగా ఆలోచించుకుని చక్కగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చిపంపించేసింది. అయితే ఆమె మాత్రం కోర్టు మాటలను పట్టించుకోలేదు. కోర్టుతో లాభం లేదనుకుని ఆమె పంచాయతీ పెద్దలను ఆశ్రయించింది. దానికి వాళ్లు కూడా విడాకులు ఇప్పించడం కుదరదు అన్నారు. ‘అంత మంచి మొగుణ్ని వదులకుని నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావ్?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్పుకుంటుంది తన బాధ కాని బాధని…!!!

దీన్ని బట్టి చూస్తే నిశ్శబ్ధం ఎంత వైల్డ్ గా ఉంటుందో చూశావా??అంటూ ఓ సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది. అటువంటిది జీవితమంతా నిశ్శబ్ధమైతే…అదే ఆమె పరిస్థితి..భరించలేనంత ప్రేమను ఎవ్వరూ భరించలేరేమో..అది ఆ భర్త తప్పు కాదు..అలాగని ఆమెదీ తప్పుకాదు..అదే నిశ్శబ్దం..నిశ్శబ్ధం..ఆ భర్తది నిశ్శబ్ధ ప్రేమను ఆమె భరించలేకపోతోంది. చూశారా..నిశ్శబ్ధం..నిశ్శబ్దం..భరించలేం.

Related Posts