యూపీలో మరో ఘోరం, అమ్మవారి పూజలో పాల్గొని వస్తుండగా..యువతిపై గ్యాంగ్ రేప్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

UP Teen, Returning Home From Navratri Festival, Gang Raped : మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనబడితే చాలు..కామాంధులు తెగబడుతున్నారు. యూపీలో ఘోరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా..అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని వస్తున్న ఓ 19 ఏళ్ల యువతిపై పాశవికంగా ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.Mahoba జిల్లాలో బుధవారం రాత్రి యువతి…స్థానికంగా ఉన్న అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంది. హరతి తీసుకున్న అనంతరం ఇంటికి తిరిగి పయనమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించారు. పన్వాడీ ప్రాంతంలో నిందితుడు తన ఇంటి వెనుక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని Superintendent of Police అరుణ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశామని, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Tags :

Related Posts :