young-man-commits-suicide-as-young-lady-cheats-in-the-name-of-love-in-agra

సోషల్ మీడియాలో రేప్ వీడియో, అవమానంతో బాలిక ఆత్మహత్య.. యూపీలో మరో దారుణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణాలు ఆగడం లేదు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బులంద్ షహర్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు మృగాళ్ల ఆగడాలు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బాలికను లైంగికంగా వేధించారు. దాన్ని వీడియో కూడా తీశారు. ఆ తర్వాత వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో అవమానభారంతో 14ఏళ్ల బాలిక తనువు చాలించింది. తమ కూతురు మృతికి ఆ ముగ్గురు నీచులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపించారు. లైంగికంగా వేధించడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని, అది తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందన్నారు.

నిందితులను అరెస్ట్ చేస్తామన్న పోలీసులు:
మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. కాగా, బాలిక ఆత్మహత్య విషయాన్ని స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వాళ్లు బాలిక ఇంటికి వెళ్లేసరికి కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేసేశారు. తమకు సమాచారం అందిన వెంటనే పోలీసులే స్వయంగా బాధితురాలి కుటుంబసభ్యులను కలిశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

దళితులకు రక్షణ లేదా?
ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూపీలో దళితులపై ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి? బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ దారుణాలకు ఎప్పుడు ముగింపు పడుతుంది? అని ప్రియాంక ప్రశ్నలు వర్షం కురిపించారు.

ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి హత్యాచారం.. ప్రియుడు అనుమానాస్పద మృతి


కొన్ని వారాలుగా యూపీలో దారుణమైన ఘోరాలు:
కొన్ని వారాలుగా యూపీలో దారుణమైన ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. పాశవికంగా వారిని హత్య చేస్తున్నారు. దీంతో విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.

వరుసగా అత్యాచారాలు, హత్యలు:
ఢిల్లీకి చెందిన 25ఏళ్ల మెడికల్ విద్యార్థిని ఆగ్రా సమీపంలో శవమై కనిపించింది. ఆగస్టు 20న ఈ ఘటన జరిగింది. మెడికల్ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ డాక్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈస్ట్రన్ యూపీలో మరో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలిక తప్పిపోయింది. ఆ తర్వాత శవమై కనిపించింది.

ఆగస్టు నెలలోనే మరో ఘోరం జరిగింది. లక్మీపూర్ కేరీ జిల్లాలో 13ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. చెరుకు తోటలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. బాలిక కళ్లు పీకేశారు. నాలిక కత్తిరించారు. ఇక వెస్ట్రన్ యూపీలోని హపూర్ లో ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి చంపేశారు.

READ  జ్యోతి హత్య కేసు : నిందితుడు శ్రీనివాస్ హెల్త్ బులెటిన్ విడుదల

Related Posts