అధికారుల ఆవుపేడ ఆఫర్ : ట్రకు పేడ ఇస్తే…గడ్డి ఫ్రీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

UP unnao cow dong Offer : ఉత్తరప్రదేశ్ లోని అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు..ముఖ్యంగా ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు వితనూత్న ఆఫర్ ప్రకటించారు. ఉన్నావ్‌ జిల్లాలోని అధికారులు రైతులు ఒక ట్రాలీ ఆవు పేడ ఇస్తే రెండు ట్రాలీల ఎండు గడ్డి ఇస్తామని ప్రకటించారు.పశువుల పెంపకానికి ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పశువులను పెంచుకోవాలని సూచిస్తున్నారు. కాగా గోవుల పెంపకంపై యూపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆవుల సంఖ్య ఎంత ఉందీ అనే విషయంపై గోవుల గోవుల గణన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆవుల గణన కోసం ప్రభుత్వం 7.86 కోట్ల రూపాయలు కేటాయించింది.ఆవులతోపాటు గేదెలు, పందులు, మేకలు, గొర్రెలను కూడా లెక్కించాలని నిర్ణయించారు. 2012 గణన ప్రకారం యూపీలో 205.66 లక్షల ఆవులున్నాయి. ఆవుల గణనతోపాటు రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి పశువుల సంతలు నిర్వహించి వాటికి ఉచిత వైద్యంతోపాటు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.కాగా యూపీ ప్రభుత్వం రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతున్న పశువులు , జంతువులను వాహనాలు ఢీకొట్టడంతో… చనిపోతున్న సంఘటనలు అనేకం జరుగుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు చర్యలు తీసుకుంది. పలు వాహనాలు ఢీకొట్టి ఆవులు చనిపోతున్నట్టు గుర్తించటంతో మూగ జీవాల ప్రాణాలు కాపాడేందుకు ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఇతర పశువుల కొమ్ములు, మెడల్లో రేడియం బ్యాండ్స్ కట్టి వాటిని ఉనికి తెలిసేలా తద్వారా అవి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.దూరం నుంచి వెలుతురు పడినా ఈ రేడియం బ్యాండ్లు మెరుస్తుంటాయి. దీంతో.. వచ్చే వాహనాలు నెమ్మదవుతాయని పోలీస్ అధికారులు అంటున్నారు. యాక్సిడెంట్లు తగ్గాయి. చలికాలంలో మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని… అందుకే పాడి పశువులకు రేడియం బ్యాండ్లు కడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తున్నారు.

Related Tags :

Related Posts :