లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భర్త తనతో తీసుకెళ్లట్లేదని సింధూరం తిని భార్య ఆత్మహత్య

Updated On - 5:00 pm, Thu, 10 December 20

UP woman kills herself by consuming ‘sindoor’ : భర్త తనతో తీసుకెళ్లట్లేదని సింధూరం తిని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వేరే ప్రాంతంలో పనిచేసే భర్త అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలో నన్ను మన బిడ్డను కూడా నీతో తీసుకెళ్లమని భార్య అడిగింది. దానికి భర్త ఒప్పుకోలేదు. దీంతో భర్తకు దూరంగా ఉండలేక..ఇరుగుపొరుగువారి మాటలు భరించలేక ఆమె సింధూరం తిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. డాన్పూర్‌కు చెందిన వికాస్ బింద్‌కు మూడేళ్ల క్రితం సరస్వతి దేవితో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల బిడ్డ కూడా ఉంది. వృత్తిరీత్యా వికాస్ సూరత్‌లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో లాక్డౌన్ వచ్చింది. దీంతో పనిలేకపోవటంతో వికాస్ తిరిగి డాన్పూర్‌ లోని భార్య దగ్గరకు వచ్చాడు. కొంతకాలం ఉన్నాడు. కరోనా తీవ్రత తగ్గడంతో వికాస్ మళ్లీ సూరత్‌ వెళ్లి పనిచేస్తున్నాడు. భార్యను మాత్రం సొంతూళ్లోనే ఉంచాడు.


డాన్పూర్ లోనే ఉండి రెండున్నరేళ్ల బిడ్డను చూసుకోవాలని భార్యకు చెప్పాడు. కానీ సరస్వతికి మాత్రం భర్తతో పాటు సూరత్‌లో ఉండాలని ఉంది. దానికి ఎందుకోమరి వికాస్ ఒప్పుకోవటంలేదు. పదే పదే అడిగింది. అయినా భర్త అంగీకరించలేదు.


దీంతో ఇరుగు పొరుగు వారు నీ భర్తకు పనిచేసే చోట వేరే ఎవరితోనైనా పరిచయాలున్నాయేమో..అందుకే నిన్ను తీసుకెళ్లట్లేదని అనటంతో ఆ మాటలు భరించలేక తీవ్ర మనస్థాపం చెందిన 26 ఏళ్ల సరస్వతి.. వికాస్ సూరత్‌కు వెళ్లిన తర్వాత సింధూరం తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది.


సింధూరంలో పాదరసం ఎక్కువగా ఉండడంతో సరస్వతి అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ బుధవారం (డిసెంబర్9,2020) మృతిచెందింది. సరస్వతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని సూర్యవ పోలీస్ స్టేషన్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆమె ఎంత మోతాదులో సింధూరం తీసుకుందో తెలుస్తుందని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *