దటీజ్ ఉపాసన : కండోమ్స్ తో డిజైన్ చేసిన డ్రస్ వేసుకుని..ఇది వేసుకునే ధైర్యం ఉందాంటూ ఛాలెంజ్

upasana designer dress made from defected condoms

ఉపాసన. పరిచయం ఏమాత్రం అవసరం లేని డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. హెల్త్, ఫిట్ నెస్ లో నెటిజన్లకు ఎన్నో సలహాలు..సూచనలు చేస్తుంటారు. అంతేకాదు సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుండే ఈ మెగా కోడలు చాలా చాలా వినూత్నమైన అంశాలపై చాలెంజ్ లు చేస్తుంటారు. ఇప్పుడు ఎవ్వరూ ఊహించని     అంశంపై చాలెంజ్ చేస్తూ మరోసారి సోషల్ మీడియాలో చాలెంజింగ్ పోస్ట్ పెట్టారు ఉపాసన. 

తాజాగా డిజైనర్ దుస్తులకు సంబంధించి ఉపాసన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది. పనికి రాని వాటిని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేస్తూ ఉపాసన తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ..లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన డిఫెక్టెడ్‌ కండోమ్స్, టెక్స్‌ టైల్‌ స్క్రాప్‌‌తో రూపొందించిన డిజైనర్ వేర్‌ను ధరించి ‘సస్టైనబుల్ ఫ్యాషన్‌దే ఫ్యూచర్’ అంటోంది ఉపాసన. 

ఎవ్వరూ ఊహించనివిధంగా.. క్రియేటివ్ డిజైనర్ వేర్‌ను ధరించిన ఉపాసన.. లోకల్ డిజైనర్ల నుండి రిజెక్ట్ చేయబడిన టెక్స్ టైల్ స్క్రాప్‌తో ఈ డిజైన్ తయారు చేయబడిందని తెలుసుతూ..తాను ధరించిన స్కట్ కూడా డిఫెక్టెడ్ కండోమ్స్ (పనికి రాని కండోమ్స్) తయారు చేసిందని తెలియజేస్తూ..ఈ స్క్రాప్ ధరించడానికి మీలో ఎంతమందికి ధైర్యం ఉందని ఛాలెంజ్ చేస్తున్నారు ఉపాసన. ఉపాసన ధరించిన ఈ కండోమ్ స్కట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దటీజ్ ఉపాసన అని మరోసారి నిరూపించుకున్నారు.

కాగా..కొంతకాలం క్రితం వెస్టరన్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాక ఇండియన్ టాయిలెట్ పొజిషన్‌లో కూర్చోవడానికి చాలా మంది ఇష్టపడటంలేదని..వాస్తవానికి వెస్టరన్ టాయిలెట్స్ పై కోర్చోవడం ఆరోగ్యకరంమని తెలుపుతూ టాయిలెట్ పొజిషన్ కూర్చుని మరీ ఫొటోని విడుదల చేస్తూ..ఇండియన్ టాయిలెట్ పొజిషన్ కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దటీజ్ ఉపాసన. 

సాధారణంగా భారతదేశంలో ప్రతీ మహిళకూ ఇంటిపేరుతోనే గుర్తింపు ఉంటుంది. అది పెళ్లికి ముందూ..తరువాత కూడా. కానీ ఉపాసనకు ఆ అవసరమే లేదు. కామినేని ఉపాసన అన్నా..కొడిదెల ఉపాసన అన్నా..తనకంటూ ఓ ప్రత్యేకతను..వ్యక్తిత్వంతో..చక్కటి గుర్తింపును..చక్కటి పేరును సంపాదించుకున్నారు ఉపాసన. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sustainable Fashion is the Future ! Dare to wear Scrap ? #covid19 reboot #Repost @cancelledplans.club ・・・@avigowariker @upasanakaminenikonidela giving us #AngelVibes in this custom Cancelled Plans outfit. Our mandate from Upasana was to create something entirely from waste. We got lucky and were able to source some textile scraps and rejects from local designers which were crucial in the construction of the garment. #Madefromwaste Custom Latex Skirt (made from defected condoms), Organza top and tank (made from textile waste). . . . #madefromwaste #neverawaste #celebstyle #slowfashion #sustainablefashion #elegant #ethereal #white #fashion #style #inspo

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

Read: సీనియర్స్ రీ ఎంట్రీ : ప్రభాస్ సినిమాలో భాగ్యశ్రీ, చిరు సినిమాలో జెనీలియా

మరిన్ని తాజా వార్తలు