లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సైక్లింగ్ లో ఉపాసన తల్లి రికార్డు :60 ఏళ్ల వయస్సులో 6 రోజుల్లో 642 కి.మీల ప్రయాణం

Published

on

Upasana Mother Cycling Hyderabad to Chennai : 60 ఏళ్ల వయస్సు..6 రోజులు సైక్లింగ్..642 కి.మీల దూరాన్ని చేరుకున్న రికార్డు ఆమె సొంతం. ఆమే.. శోభన కామినేని. అదేనండీ పరిచయం అవసరం లేని పేరు ‘ఉపాసన’. ఉపాసన తల్లి శోభన కామినేని కేవలం ఆరంటే ఆరే రోజుల్లో శోభనా కామినేని తన 60 ఏళ్ల వయస్సులో ఏకంగా 642 కిలో మీటర్ల దూరాన్ని సైకిల్ తొక్కుతూ అధిగమించి రికార్డు సాధించారు.

మెగా స్టార్ కోడలిగానే కాదు..రామ్ చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఉపాసన తన తల్లి సాధించిన ఈ విజయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే ఉపాసన తన తల్లి సాధించిన ఈ అరుదైన రికార్డును ట్విట్టర్లో పంచుకున్న వెంటనే అదికాస్తా వైరల్ గా మారింది.

ఉపాసన తన వ్యక్తిగత వివరాలను, ఆరోగ్య సూచనలను నెటిజన్లతో పంచుకోవడం ఉపాసనకు అలవాటు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన తన తల్లికి సంబంధించి పోస్ట్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఉపాసన తల్లి పేరు శోభన కామినేని.. ప్రస్తుతం శోభన ఆపోలో ఆసుత్రులకు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. శోభన కామినేని తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి సైకిల్‌పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. అది కూడా 60 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించడం అంటే మాటలు కాదు.చక్కటి ఫిట్ నెస్ ఈ విజయాన్ని సాధించారు శోభన.

హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ నుంచి మొదలైన శోభన సైకిల్ ప్రయాణం.. చెన్నైలోని బిషాప్ గార్డెన్స్‌లో ముగిసింది. కేవలం ఆరు రోజుల్లోనే 642 కి.మీల దూరాన్ని సునాయాసంగా చేరుకున్నారు శోభన. ఈ లెక్కన చూస్తే శోభ సరాసరి రోజుకి వంద కిలోమీటర్లపైగా సైక్లింగ్ చేశారన్నమాట.

ఈ ఘనతను సాధించిన తన తల్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఉపాసన తల్లిని ప్రశంసించి అభినందనలు తెలిపారు. మహిళలకు ఫిట్ నెస్ అనేది చాలా అవసరం తెలిపారు. ఫిట్ నెస్ అనేది ఆరోగ్యానికి సంబంధించినదనీ..మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లే ఆరోగ్యం ఉంటుందని తెలిపారు.