లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

వెండితెరపైకి వాస్తవాలు.. ఆసక్తికరంగా సెలబ్రిటీల బయోపిక్స్..

Published

on

Biopic Movies: గడిచిన రెండేళ్లలో బయోపిక్ సినిమాల టైమ్ బాగా నడిచింది. వరుస పెట్టి బయోపిక్‌లు సందడి చేశాయి. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా.. ప్రస్తుతం మళ్ళీ బయోపిక్స్ టైమ్ స్టార్ట్ అయ్యింది. పొలిటీషియన్స్.. స్పోర్ట్స్ స్టార్స్.. సినిమా సెలబ్రెటీల బయోపిక్ మూవీస్ తెరపైకి రాబోతున్నాయి.

సోగ్గాడు శోభన్ బాబు జీవితం ఆధారంగా..
ఎన్టీఆర్.. సావిత్రి.. సంజయ్ దత్.. వంటి సెలబ్రెటీల బయోపిక్ లతో పాస్ట్ అంతా వెండితెర సందడిగా మారింది. కరోనా గ్యాప్ తరువాత మళ్లీ బయోపిక్‌ల హవా స్టార్ట్ అయ్యింది. వరుసగా సెలబ్రెటీల బయోపిక్‌లు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. రీసెంట్‌గా అందాల నటుడు, వెండితెర సోగ్గాడు శోభన్ బాబు లైఫ్ స్టోరీ ఆధారంగా సినిమాకు ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సోగ్గాడి పాత్రలో రానాను సంప్రదిస్తున్నారట మేకర్స్.. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.


సౌందర్య, జయలిలత బయోపిక్స్..
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో యాక్సిడెంట్‌లో చనిపోయింది సౌందర్య. ఇన్నాళ్లకు ఆమె బయోపిక్‌పై న్యూస్ బయటకు వచ్చింది. అంతే కాదు సౌందర్య పాత్ర కోసం న్యాచురల్ యాక్ట్రెస్ సాయిపల్లవిని ఒప్పించే పనిలో ఉన్నారు మేకర్స్. మరో వైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కథానాయిక జయలలిత బయోపిక్ ‘తలైవి’ షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది. జయ పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది కంగనా.

స్పోర్ట్ స్టార్స్ సినిమాలు..

‘మహానటి’ తరువాత ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ పెరిగిపోయింది. సెలబ్రెటీల జీవితాలను ఇప్పటితరానికి ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తున్నారు మేకర్స్. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా.. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కబోతోంది. రీసెంట్‌గా ‘800’ టైటిల్‌తో మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవే కాదు మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా రాబోతుంది. మిథాలీ పాత్రలో తాప్సీ కనిపించబోతోంది. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ క్రికెట్ కెరీర్ ఆధారంగా తెరకెక్కిన ‘83’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇవికాక సుధీర్ బాబు చేయాల్సిన బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయెపిక్‌తో పాటు మరికొన్ని లైఫ్ స్టోరీలు బయోపిక్‌లుగా తెరకెక్కబోతున్నాయి.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *