లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయ్..

Updated On - 5:18 pm, Wed, 20 January 21

Tollywood Releases: లాక్‌డౌన్ తర్వాత అన్ని రంగాలలానే స్థంబించిపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతోంది. ఓ వైపు షూటింగులు మరోవైపు సినిమా రిలీజులతో పూర్వ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది. గతేడాది డిసెంబర్ 25 న సుప్రీం హీరో సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సోలో బెటర్’ సినిమా విడుదల కాగా ఈ సంక్రాంతికి ‘క్రాక్’, ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్ని సినిమాలు మంచి టాక్‌తో చక్కటి కలెక్షన్లతో లాభాల బాట పట్టాయి. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాల రిలీజుకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం విడుదల తేది ఖరారు చేసుకున్న సినిమాలు ఏంటో చూద్దాం..
అల్లరి నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’ జనవరి 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 29 న యాంకర్ ప్రదీప్ హీరోగా లాంచ్ అవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’, సుమంత్ ‘కపటదారి’ సినిమాలు రిలీజ్‌కి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

Bangaru Bullodu

ఫిబ్రవరి 5 న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ విడుదల కానుంది. అదేరోజు బాల నటుడిగా అలరించి ఇటీవల ‘ఓ బేబి’ తో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘జాంబీ రెడ్డి’ కూడా రిలీజవుతోంది. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

Zombie Reddy

సందీప్ కిషన్ నటించగా హాకీ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన తొలి చిత్రం ‘A 1 ఎక్స్‌ప్రెస్’, ఆది సాయికుమార్ ‘శశి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఈ మూవీస్ ఆడియెన్స్ ఆదరణ చూరగొంటే ఇంతకుముందులానే ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశముంటుంది.

A 1 Express