లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

యూపీఐ ద్వారా పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దు

Updated On - 12:40 pm, Fri, 22 January 21

UPI payments : యూపీఐ (UPI) ద్వార పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సూచించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)ని అప్ గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో…చెల్లింపులు పని చేయకపోవచ్చు. కొద్ది రోజుల్లో అప్ గ్రేడ్ చేస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయొద్దని సూచించింది. కానీ..ఎన్ని రోజులనేది స్పష్టంగా చెప్పలేదు. కొద్ది రోజుల పాటు యూజర్లు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని, చెల్లింపుల విషయంలో ముందే ప్లాన్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

ఎన్ పీసీఐ సూచించిన సమయంలో…లావాదేవీలు చేయకుండా ఉండాలని వెల్లడించింది. సురక్షితమైన..ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో యూపీఐ ప్లాట్ ఫామ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం భీమ్ యూపీఐ ప్లాట్ ఫామ్ లో 165 బ్యాంకులు జాబితాలో ఉన్నాయి. 2020, అక్టోబర్ నాటికి NPCI ఆండ్రాయిడ్ లో 155.14 మిలియన్ యూజర్ లను iOS లో 2.94 మిలియన్ యూజర్లు ఉన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరిగాయి. డిస్కౌంట్లు కూపన్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉండడంతో యూజర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. యూపీఐ మార్కెట్ లో గూగుల్ పేను పే వరుసగా..మూడోసారి అధిగమించడం విశేషం.