ఆడపిల్లగా పుట్టడమే నేరమా, పాప పుట్టిందని తల్లిదండ్రులే చంపేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కర్నాటక రాష్ట్రం మంగళూరులో దారుణం జరిగింది. తల్లిదండ్రులే ఘాతుకానికి ఒడిగట్టారు. ఏ తల్లి, తండ్రి చేయకూడని పని చేశారు. ఆడపిల్ల పుట్టిందని కన్నవారే చంపేశారు. ఆ తర్వాత డ్రామా ఆడారు. తమ పాపను ఎవరో కిడ్నాప్ చేసి చంపేశారని దొంగ ఏడుపు ఏడ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజం ఏంటో బయటపెట్టారు. కిడ్నాప్, హత్య డ్రామా అని తేల్చారు. కన్నవారే పసికందుని చంపేశారని నిర్ధారించారు. తామే తమ 40రోజుల బిడ్డను బావిలో పడేసి చంపేశామని తల్లిదండ్రులు నేరాన్ని అంగీకరించారు.మంగళూరులోని ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సిలో చంద్రశేఖర్, ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రియాంక ఇటీవలో ఆడపాపకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల క్రితం ప్రియాంక సోదరుడు అభిషేక్ పోలీసులను ఆశ్రయించాడు. తన సోదరి కూతురిని ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాఫ్తు ప్రారంభించారు.కొన్ని రోజుల క్రితం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో ప్రియాంక లేచి చూడగా, పక్కనే ఉండాల్సిన కూతురు తనుశ్రీ కనిపించలేదు. దీంతో ఆమె కంగారు పడింది. ఆందోళనకు గురైంది. విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పింది. వెంటనే కుటుంబసభ్యులు పాప కోసం వెతకడం ప్రారంభించారు. కాసేపటికి ప్రియాంక ఇంటికి సమీపంలో ఉన్న బావిలో పాప మృతదేహం కనిపించింది. దీంతో అంతా షాక్ అయ్యారు. పాపను విగతజీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాపను ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని ప్రియాంక సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందం దర్యాఫ్తు చేపట్టింది. అసలేం జరిగింది? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చంపారు? అనే కోణాల్లో విచారణ ప్రారంభించారు. విచారణలో తల్లిదండ్రులు చెప్పిన సమాధానాలతో పోలీసులకు వారిపై అనుమానం కలిగింది. దీంతో తమ స్టైల్ లో తల్లిదండ్రులను పోలీసులు ఎంక్వైరీ చేశారు. అంతే, ప్రియాంక, చంద్రశేఖర్ నిజం కక్కేశారు. పాపను కిడ్నాప్ చేసి చంపేశారు అనేది డ్రామా అని చెప్పారు. పాపను తామే చంపేశామని నేరాన్ని అంగీకరించారు. ఈ నేరంలో కుటుంబసభ్యులు ఎవరికీ ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఆడపిల్ల పుట్టడం తమకు ఇష్టం లేదని, ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే 40రోజుల పసికందుని చంపేశామని తల్లిదండ్రులు చెప్పారు.

కన్న తల్లిదండ్రులే బిడ్డను చంపడం స్థానికంగా సంచలనం రేపింది. కుటుంబసభ్యులతో పాటు స్థానికులను, పోలీసులను షాక్ కి గురి చేసింది. ఆ తల్లిదండ్రుల ఆలోచనా తీరుని తప్పుపట్టారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లగా పుట్టడమే ఆ బిడ్డ చేసిన నేరమా? అని వాపోయారు. ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా ఒక్కటే అని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నాయి. వివక్ష చూపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆడపిల్లను భారంగా భావించే రోజులు పోవాలని అంతా కోరుతున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల అని తెలవగానే మానవతా విలువలను మరిచి పురిట్లోనే అర్థాంతరంగా చంపేస్తున్నారు. కొందరేమో మురికికాలువల పక్కన, చెత్తకుప్పల్లో పసికందులను పడేస్తున్నారు. కళ్లు తెరిచి సమాజాన్ని చూసేలోపే చిదిమేస్తున్నారు.ఆడపిల్ల అంటే మైనస్ అని, మగపిల్లాడు అంటే ప్లస్ అనే పిచ్చి భావన పోవాలి. ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అనే వారు. ఇపుడు అలాంటి మహాలక్ష్మీ పుడితే భారంగా, బరువుగా భావిస్తున్నారు. ఇంట్లో మహాలక్ష్మిలా తిరగవలసిన ఆడపిల్లలకి ఉనికే లేకుండా చేస్తుంటే బాధేస్తోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏ మాత్రం తక్కువ కాదని, అన్ని రంగాల్లో ముందుంటున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కని పెంచడానికి అమ్మ కావాలి, చివరివరకూ తోడుండాలి కాబట్టి భార్య కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం ఆడపిల్ల వద్దు. ఈ ఆడదే లేకపోతే అసలు సృష్టే లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

Related Tags :

Related Posts :