లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

శివసేనలో చేరిన ఊర్మిళ.. శివ బంధన్‌తో సభ్యత్వం

Published

on

రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్‌లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించబడింది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే శివ బంధన్‌ను కట్టి ఆమెకు పార్టీ సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో ఉద్దవ్ ఠాక్రేతో పాటు, పార్టీకి చెందిన పలువురు నాయకులు సుభాష్ దేశాయ్, అనిల్ దేశాయ్ పాల్గొన్నారు.నటి కంగనా రనౌత్‌ విషయంలో ఊర్మిళ మాతోండ్కర్ స్పందించిన తీరును పార్టీ నాయకత్వం గమనించిందని, ఈ క్రమంలోనే ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లు శివసేన నాయకుడు తెలిపారు. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి గందరగోళం క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని BMC కూల్చివేసింది. ఈ చర్యలు రాజకీయంగా అక్కడ విమర్శలు, ప్రతి విమర్శలకు కారణం అయ్యాయి.శాసనమండలి కోటా నుంచి గవర్నర్‌ను నామినేట్ చేయడానికి శివసేన గవర్నర్ బిఎస్ కోశ్యారికి ఊర్మిళ మతోండ్కర్ పేరును పంపగా.. మహా వికాస్ అగాడి ఈ కోటాకు మరో 11 పేర్లను కూడా పంపింది. అయితే, ఈ 12 పేర్లను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ఊర్మిళ మతోండ్కర్ 2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి తరువాత పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ ముంబై యూనిట్‌పై అసంతృప్తి కారణంగా ఆమె ఆ పార్టీని విడిచిపెట్టారు. పార్టీలో చేరిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఆమె విడిచిపెట్టారు.రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో ఫేమస్ అయిన ఊర్మిళ.. మరాఠీ చిత్రం ‘జాకోలా’ (1980) తో బాలనటిగా నటనను ప్రారంభించింది. ‘కల్యాగ్’ (1981) ఆమె నటించిన మొదటి హిందీ చిత్రం. రంగీళా, సత్య, భూత్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో అనగనగా ఒక రోజు, అంతం వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *