లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

శివసేనలోకి ఊర్మిళ.. ఎంట్రీ గిఫ్ట్ ఏమిటంటే?

Published

on

Shiv Sena

Urmila Matondkar : రంగేళీ ఊర్మిళా శివసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆమె శివసేన పార్టీలో లాంఛనంగా చేరుతారంటూ ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శివసేన తరఫున గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఊర్మిళా పేరును గవర్నర్‌కు శివసేన సిఫార్సు చేసినట్టు సమాచారం.నటి కంగనా రనౌత్‌తో శివసేన పార్టీకి చిక్కులు ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా కంగనా గళం విప్పుతున్నారు. ఏకంగా ముంబైని పీవోకే తో పోల్చారు. శివసేన- కంగనల మధ్య మాటల యుద్ధం పెరిగి న్యాయస్థానాల వరకు చేరుకుంది. కంగనను ధీటుగా ఎదుర్కొనేందుకు శివసేన పార్టీలో మహిళా నేతలు లేరు. కంగనా వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీఎం ఉద్దవ్‌ లేదా ఆ పార్టీ కీలక నేత సంజయ్‌ రావత్‌లే బదులు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో కంగనకు కౌంటర్‌ ఇచ్చేందుకు ఊర్మిళాను పార్టీలోకి ఆహ్వనించారనే ప్రచారం జరుగుతోంది.రామ్‌గోపాల్ వర్మ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఊర్మిళా మతోండ్కర్‌. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ముంబై నార్త్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలతో పొసగకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *