లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

అమెరికాలో అక్టోబర్ నాటికి లక్షా 80వేల మంది కరోనాతో చనిపోతారు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరగనుందా? కరోనా వైరస్ మరింతమంది అమెరికన్లను

Published

on

U.S. Deaths From Covid-19 Forecast to Hit 180,000 by October

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరగనుందా? కరోనా వైరస్ మరింతమంది అమెరికన్లను

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరగనుందా? కరోనా వైరస్ మరింతమంది అమెరికన్లను బలి తీసుకుంటుందా? అక్టోబర్ నాటికి కరోనా మరణాల సంఖ్య లక్షా 80వేలకు పెరుగుతుందా? అంటే అధ్యయనాలు అవుననే అంటున్నాయి. అమెరికాలో ప్రస్తుతం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య లక్షా 23వేల 473. అక్టోబర్ నాటికి కరోనా డెత్ కౌంట్ లక్షా 80వేలకు చేరుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే విధిగా ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి చర్యల వల్ల కొంత నష్టం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. అమెరికాలో ఆగస్టు తర్వాత కరోనా మరణాల సంఖ్య పెరగనుంది. అక్టోబర్ నాటికి మరణాల సంఖ్య లక్షా 79వేల 106కి చేరొచ్చని అంచనా వేశారు.

ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో 24లక్షల కేసులు:
ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ ఉధృతమవుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 35,383 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 24వేల 168కి చేరింది. ఇప్పటివరకు దేశంలో లక్షా 23వేల 473 మంది మరణించారు. నిన్న కొత్తగా 874 మంది మృతిచెందారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌ అమెరికాను దాటేసింది. తాజాగా 40,131 కేసులు నమోదవడంతో, మొత్తం కేసులు 11లక్షల 51వేల 479కి పెరిగాయి. నిన్న ఒక్కరోజే 1364 మంది మరణించడంతో మరణాల సంఖ్య 52వేల 771కి చేరింది. 

మాస్కులతో మరణాల సంఖ్య తగ్గించొచ్చు:
అమెరికాలో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో కొంతవరకు మరణాల సంఖ్య తగ్గిందని చెప్పారు. కరోనా బారిన పడ్డ యువత రికవర్ అవుతుండటమే ఇందుకు కారణం. అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గించడానికి ఏం చేయాలనేది నిపుణులు చెప్పారు. అమెరికా జనాబాలో 95శాతం మంది అమెరికన్లు కచ్చితంగా పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించినట్టు అయితే కరోనా మరణాల సంఖ్యను( లక్షా 46వేల 47కి), వ్యాప్తిని తగ్గించొచ్చని నిపుణులు అంచనా వేశారు. కరోనా వ్యాప్తి పెరుగుతూ పోతే కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. టెక్సాస్, ఫ్లోరిడాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. కాగా, భౌతిక దూరం నిబంధనను కచ్చితం చేస్తే తప్ప పరిస్థితి మెరుగవదనే వాదనలూ వినిపిస్తున్నాయి.

ప్రపంచంలో 93.5 లక్షలు దాటిన కరోనా కేసులు:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేయడంతో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు మరింత ఎక్కువ అవుతున్నాయి. రెండు వారాలుగా ప్రతిరోజు లక్షకుపైనే నమోదవుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు గత ఐదు రోజుల నుంచి రోజూ లక్షన్నర దాటుతున్నాయి. తాజాగా లక్షా 59వేల 396 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 53వేల 735కు పెరిగింది. అలాగే నిన్న 5వేల 431 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 79వేల 805కు చేరింది. కరోనా బారినపడినవారిలో 50లక్షల 41వేల 711 మంది కోలుకోగా, 38లక్షల 32వేల 219 మంది చికిత్స పొందుతున్నారు. అంటే యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్నవారు 12 లక్షలకు పైగా ఉన్నారు.

కరోనా కేసుల్లో మూడో స్థానంలో రష్యా, ఆ తర్వాత భారత్:
అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రష్యాలో ఇప్పటివరకు 5లక్షల 99వేల 705 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల దేశంలో 8వేల 359 మంది మరణించారు. గత వారం రోజులుగా పదివేల పైచిలుకు కేసులు నమోదవుతుండటంతో కొత్త కేసుల విషయంలో భారత్‌ మూడో స్థానంలో ఉండగా, మొత్తం కేసుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 4లక్షల 56వేల 115 పాజిటివ్‌ కేసులు ఉండగా, మరణాల సంఖ్య 14వేల 483కు చేరింది. భారత్‌లో రోజువారీ మరణాల్లో బ్రెజిల్‌, అమెరికా, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలో ఉండగా, మొత్తం మరణాల్లో ఎనిమిదో స్థానంలో ఉంది.

* యూకేలో ఇప్పటివరకు 4లక్షల 56వేల 115 కేసులు నమోదవగా, 42వేల 927 మంది మరణించారు. 
* స్పెయిన్‌లో 2,93,832 పాజిటివ్‌ కేసులు ఉండగా, 28,325 మంది మృతిచెందారు. 
* పెరూలో 2,60,810 మంది కరోనా బారిన పడగా, 8,404 మంది బాధితులు మరణించారు. 
* చిలీలో ఇప్పటివరకు 2,50,767 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 4505 మంది చనిపోయారు. 
* ఇరాన్‌లో 2,09,970 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 9863 మంది మరణించారు. 
* ఇటలీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,833కు చేరింది. ఇప్పటివరకు 34,675 మంది మరణించారు.

Read: దేశాధ్య‌క్షుడైనా మాస్కు ధ‌రించాల్సిందే

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *