లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

రాముడి 3-D చిత్రాలు ప్రదర్శించొద్దు..న్యూ యార్క్ మేయర్ కు లేఖ

Published

on

అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో నిండిపోనున్నాయి.అయితే..ఎలాంటి చిత్రాలను ప్రదర్శించవద్దని 20 సంస్థలు న్యూయార్క్ మేయర్ Bill de Blasioకు లేఖ రాశారు. భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం…హిందుత్వ జాతీయ వాదంతో ఉందని, కానీ న్యూ యార్క్ నగరంలో సమతుల్య విలువలను కలిగి ఉందని వెల్లడిస్తున్నారు. ఇలాంటి వేడుకను ఎలా అనుమతినిస్తారని ప్రశ్నించారు.

హిందువులు, ఫాసిజానికి వ్యతిరేకంగా ఉన్న వారు లేఖలో సంతకం చేసిన వారిలో ఉన్నారు. దాదాపు 425 సంవత్సరాల పురాతన మసీదును నాశనం చేసిన తర్వాత..ఇప్పుడు సంబరాలు జరుపుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మత హింస కారణంగా..వేల మంది చనిపోయారని గుర్తు చేస్తున్నారు.17 వేల చదరపు అడుగుల ఎత్తయిన ఎల్ ఈ డీ స్క్రీన్ లతో పాటు..ఇతర స్క్రీన్లను వినియోగించనున్నారు. ఆగస్టు 05వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు జై శ్రీరామ్ అనే పదాలు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఈ స్ర్కీన్లలో కనిపించేలా చూడనున్నారు.

అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీకి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అయోధ్యలోని రామ జన్మ భూమికి సంబంధించిన వివాదంపై గత సంవత్సరం నవంబర్ లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పదమైన భూమిని రామ ఆలయ నిర్మాణం ట్రస్టుకు అప్పగిస్తామని, మసీదు నిర్మించడానికి ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.రాముడు నడయాడిన నేలలోనే.. శ్రీరామచంద్రమూర్తి పాలన సాగించిన ప్రదేశంలోనే.. రామరాజ్యం సాగిన ప్రాంతంలోనే.. ఇప్పుడు మళ్లీ రామునికి పట్టాభిషేకం జరగబోతోంది. ఈ కీలక ఘట్టం కోసం.. యావత్ హిందూ సమాజం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. త్రేతాయుగం నాటి రాముడు.. కలియుగంలో తాను జన్మించిన స్థలంలోనే దేవుడిగా కొలువుదీరే వైభవాన్ని కనులారా వీక్షించాలని తపిస్తోంది యావత్ భారతావని.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *