లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మిరాకిల్ : 45 నిమిషాలు ఆగిన గుండె, బతికించిన డాక్టర్లు

Published

on

US hiker brought back to life : వైద్య చరిత్రలో మిరాకిల్ జరిగింది. 45 నిమిషాల పాటు గుండె ఆగిన మనిషిని తిరిగి బతికించారు డాక్టర్లు. ఓ ట్రెక్కర్‌ మంచు పర్వతం ఎక్కుతూ ప్రమాదంలో చిక్కుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి చేరిన వెంటనే గుండె ఆగిపోయింది. అయితే ఆస్పత్రిలో చికిత్స అందించగా తిరిగి బతికాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.ఎమర్జెన్సీ వార్డు :-
45 ఏళ్ల మైఖేల్ నాపిన్‌స్కీ మౌంట్ రైనర్ నేషనల్ పార్క్‌లో రాత్రి సమయంలో ప్రమాదంలో చిక్కుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే.. ఎయిర్‌లిఫ్ట్‌లో అతన్ని హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఆసుపత్రికి వచ్చే సమయానికి పల్స్ ఉన్నా.. వెంటనే గుండె ఆగిపోయింది. దీంతో.. నాపిన్‌స్కీని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు.ఎక్మో సహాయంతో:-
ఎక్మో సహాయంతో అతనికి కృత్రిమంగా శ్వాస అందించే ప్రయత్నం చేశారు. పదే పదే సీపీఆర్ చేస్తూ గుండె, లంగ్స్‌ను కార్బన్ డౌ ఆక్సైడ్‌ను తొలగించారు. చివరకు 45 నిమిషాల పాటు ఆగిన గుండె తిరిగి కొట్టుకుంది. అతను బతికినా.. ఆ రాత్రంతా డాక్టర్లు పరిస్థితిని చెక్ చేస్తూనే ఉన్నారు. రెండు రోజుల పాటు కోమాలో ఉన్న మైఖెల్ నాపిన్‌స్కీ.. ఆ తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.మృత్యుంజయుడు :-
మంచు పర్వతంపైకి నవంబర్ 7న ఓ స్నేహితుడితో కలిసి నాపిన్‌స్కీ వెళ్లాడు. పర్వతం నుండి క్యాంప్ మెయిర్ వరకు స్కీయింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో అక్కడి నుంచి పడిపోయాడు. దీంతో శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. అతని స్నేహితుని ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు ఎయిల్ లిఫ్ట్ ద్వారా నాపిన్‌స్కీని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండె ఆగిపోయినా… డాక్టర్ల కృషితో చివరకు మృత్యుంజయుడిగా మారాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *