గూగుల్ నమ్మించి మోసం చేస్తుందంటోన్న US

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, 11 రాష్ట్రాలు కలిసి ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌పై మంగళవారం కంప్లైంట్ చేశారు. ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్‌లో చట్ట విరుద్ధంగా పాల్పడుతుందని క్లెయిమ్ చేసింది. 1998 నుంచి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు కాంపిటీషన్ కాకుండా ఉండేందుకు గ్రౌండ్ బ్రేకింగ్ యాంటీ ట్రస్ట్ కేస్ నడుస్తూనే ఉంది.

ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం కొన్ని బిలియన్ డాలర్లు వెచ్చించి ఫోన్ మ్యాన్యుఫ్యాక్చర్లు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా గూగుల్ ఉండేలా చేస్తున్నారు. ‘కోర్టు ఆర్డర్ పట్టించుకోకుండా.. గూగుల్ యాంటీ కాంపిటీటివ్ స్ట్రాటజీని ఉపయోగిస్తుంది. వినియోగదారులు చాయీస్ తీసుకునే హక్కును తగ్గించి, కొత్తదనాన్ని స్వాగతించకుండా చేస్తుంది’ అని పేర్కొంది.ఆల్ఫెబెట్ ఇన్‌క్లూజివ్ అనే పేరెంట్ కంపెనీకి చెందిన గూగుల్.. క్రోమ్ అనే లీడింగ్ వెబ్ బ్రౌజర్ ను మెయింటైన్ చేస్తుంది. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ లో టాప్ వీడియో సైట్ యూట్యూబ్, మోస్ట్ పాపులర్ డిజిటల్ మ్యాపింగ్ సిస్టమ్ తో మార్కెట్లోకి వస్తుంది. ఈ వెబ్ సెర్చ్ ఇంజిన్ 90శాతం గ్లోబల్ సెర్చెస్ ను కంట్రోల్ చేస్తుంది.

గూగుల్ నుంచి కొత్త ఫీచర్.. ‘hum అన్నా.. విజిల్ వేసినా.. పాడినా’ వెతికి పెడుతుంది!


‘గూగుల్ అనేది ఇంటర్నెట్, సెర్చ్ అడ్వర్టైజింగ్ చేయమని అడిగే రక్కసిలా మారిపోయింది’ అని యూఎస్ డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్ రోసెన్ చెప్పారు. మోనోపాలీగా వ్యవహరిస్తుండటంతో.. హానికారక కాంపిటీషన్ ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది’ అని అధికారులు చెబుతున్నారు.

దీనిపై గూగుల్ వెంటనే రెస్పాండ్ అయింది. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి ఇవాళ ఆరోపణ ఎదుర్కొన్నాం. ప్రజలు వారు చాయీస్ గా మాత్రమే గూగుల్ ను ఎంచుకున్నారు. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఎందుకంటే వారికి ప్రత్యామ్న్యాయాలు కూడా ఉన్నాయి’ అని ట్వీట్ ద్వారా వెల్లడించింది.

గూగుల్ కంపెనీ తన వ్యాపారాలను ప్రజలకు ఉపయోగపడేలా, బెనిఫిట్ పొందేలా వ్యవహరిస్తుందని కంపెనీ చెప్పింది. గూగుల్ సర్వీసుల తీరు ఈ రకంగానే కొనసాగితే ఇకపై మరిన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ప్రస్తుత బ్రాడర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బిజినెసెస్ పైనా ఇన్వెస్టిగేషన్ జరగొచ్చని అటార్నిజనరల్ చెప్పారు.

Related Tags :

Related Posts :