లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

రోగి కోసం గుండెను తీసుకెళ్తూ..హాస్పిటల్‌పైనే కుప్పకూలిన హెలికాప్టర్..వీడియో

Published

on

US Los Angeles : helicopter carrying donor heart crashes : అవయవదానం..ఎంతో గొప్పది. ఓమనిషి చనిపోతూ మరికొందరికి జీవితాలను ప్రసాదించే గొప్ప దానం. చనిపోయిన మనిషి జీవించి ఉండే అద్భుతమైన అవకాశం అవయవదానం. దీంట్లో భాగంగానే ఓ దాత చేసిన అవయవదానం వల్ల ఓ పేషెంటుకు అమర్చాల్సిన ‘గుండె’ అనుకోకుండా చేయి జారింది. రోగికి అమర్చాల్సిన గుండెను ఓ హెలికాప్టర్ లో తరలిస్తుండగా రెండు ప్రమాదాలు జరిగాయి. కానీ ఆ ‘గుండె’కు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు.గుండెను హాస్పిటల్ కు తరలిస్తున్న హెలికాప్టర్ ఆల్ మోస్ట్ రోగికి ఆపరేషన్ చేయాల్సిన హాస్పిటల్ మీదకు వచ్చేసింది. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ కాబోతోంది. అంతలో అనుకోకుండా ఆ హాస్పిటల్ భవనంపైనే ఉన్న హెలిప్యాడ్ మీద దిగుతుండగా కుప్పకూలిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పెద్ద గండం తప్పిపోయింది. కానీ మరోసారి ఆ గుండె ప్రమాదం ఏర్పడింది. అలా రెండోసారి కూడా ఆ ‘గుండె’ ప్రమాదం తప్పింది. గుండె ఉన్న బాక్సు అతని చేతిలోంచి జారి గుండె కింద పడిపోయింది. మరి ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం..అమ్మకానికి ట్రంప్ హెలికాఫ్టర్.. ధర ఎంతంటే?


వివరాల్లోకి వెళితే..యూఎస్ లోని లాస్‌ ఏంజెల్స్‌లో ఓ రోగిని కాపాడేందుకు..దాత నుంచి సేకరించిన గుండెను హుటాహుటిన నగరంలోని కెక్ హాస్పిటల్‌కు చేర్చేందుకు నిపుణులు చర్యలు తీసుకున్నారు. బాక్సును అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తు..గుండె ఉన్న ఓ హెలికాప్టర్ లో హాస్పిటల్ మీద ఉన్న హెలిప్యాడ్ పై ల్యాండ్ అవ్వాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగానే అంతా జరుగుతుండగా..హెలికాఫ్టర్ హెలిప్యాడ్ పై ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది.


ఈ ప్రమాదంలో పైలట్‌కు చిన్నచిన్న గాయాలయ్యాయి..మిగతా ఇద్దరికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బైటపడ్డారు. అనంతరం గుండెను ఉంచిన బాక్స్ కూడా సురక్షితంగానే ఉంది. అనంతరం సదరు సిబ్బంది ఆ గుండెను హెలికాప్టర్ నుంచి తీసి హాస్పిటల్ డాక్టర్ కు అందించగా..అతను దాన్ని జాగ్రత్తగా పట్టుకుని వెళ్తుండగా జరగకూడని ఘటన జరిగింది. అతని కాలికి ఏదో తగిలి జారి పడిపోయాడు. ఆ బాక్సు కూడా అతని చేతిలోంచి జారి కిందపడిపోయింది.
అది చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. దాత త్యాగం వృథా అయిపోతుందేమో..ఆ గుండె అమర్చాల్సిన రోగి పరిస్థితి ఏంటీ అని ఆందోళన పడిపోయారు. కానీ అదృష్టం..ఆ ‘గుండె’కు ఏమీ జరగలేదు. రెండో ప్రమాదంలో కూడా గుండెకు ఏమీ కాలేదు. సురక్షితంగానే ఉంది. అది కిందపడినా.. డాక్టర్లు వెంటనే రియాక్ట్ అయి చేయాల్సినది చేసి సదరు రోగికి సరైన సమయంలో ఆపరేషన్ చేసి గుండెను అమర్చారు. దీంతో సదరు రోగి ఎంత అదృష్టవంతుడో అనిపిస్తోంది.గుండెను తీసుకొస్తుండగా రెండు ప్రమాదాలు జరిగినా ఆ గుండెకు ఏమీ కాకపోవటం అతని అదృష్టమేనని స్థానిక మీడియా సైతం కథనాలు ప్రసారం చేసింది.దాత ఇచ్చిన ఆ గుండెకు వరుసగా ప్రమాదాలు ఎదురైనా.. ఏమీ కాకపోవడం గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా ఆ గుండెను స్వీకరించిన ఆ రోగి చాలా లక్కీ అంటూ మామూలు లక్కీ కాదు అనిపిస్తోంది కదూ…!!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *