లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వయస్సు 36..పదో బిడ్డకు జన్మనిచ్చి..కరోనాతో మృతి..

Published

on

US Mather dies with corona after birth to 10th child :  పెళ్లిలో వధూ వరుల్ని పదిమంది పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా..అని ఆశీర్వదించేవారు పెద్దలు. కానీ ఈరోజుల్లో ఒకరిద్దరి పిల్లల్ని కని పెంచటమే కష్టమైపోతోంది. అటువంటిది..ఓ 36 ఏళ్ల మహిళ ఏకంగా 9మంది పిల్లల్ని కన్నది. వారంతా బాగానే ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె మరోసారి గర్భందాల్చింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పాపం ఇన్ని కాన్పుల్ని సునాయాసంగా అధిగమించిన ఆ పదిమంది పిల్లల తల్లిని కరోనా పొట్టన పెట్టుకుంది. పదో బిడ్డకు జన్మనచ్చిన పదిరోజులకే ఆమె కరోనాతో మృతి చెందిన ఘటన యూఎస్ లోని దక్షిణ కరోలినాలో చోటుచేసుకుంది.

ఆమె పేరు ఆష్లే బెన్నెట్. 36 ఏళ్ల వయసులో పదోసారి గర్భందాల్చింది. ఆ సమయంలోనే ఆష్లేకు కరోనా మహమ్మారి సోకింది. ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. కానీ కరోనా వైరస్ చాలా ఫాస్టుగా ఆమె శరీరంలో వ్యాపించటంతో ఆష్లే ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆందోళన చెందిన డాక్టర్లు ఆమెకు జనవరి1న సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. బిడ్డ బాగానే ఉంది. కానీ ఆపరేషన్ చేసిన కేవలం పదిరోజుల్లోపే ఆష్లే కరోనాకు బలైంది. ఆ పదిమంది పిల్లలు తల్లిలేనివారయ్యారు. ఆష్లే మరణ వార్తతో ఆమె భర్త డారిల్..తల్లడిల్లిపోయాడు. బిడ్డలందరిని అక్కున చేర్చుకుని ‘కరోనాను ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవద్దని తమ కుటుంబంలాగా కావద్దని’ సూచిస్తున్నాడు.

‘కరోనాను అందరూ సీరియస్‌గా తీసుకోవాలి. మా కష్టసుఖాల్లో నాకు తోడుగా అండగా ఉన్న నా భార్య అతి చిన్నవయస్సులోనే నాకు పదిమంది పిల్లల్ని కని ఇచ్చి కరోనా కాటుకు బలైపోయింది. కేవలం 36 ఏళ్లకే ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయింది’ అంటూ కన్నీటితో తెలిపాడు.

ఇక ఆష్లే పిల్లల సంగతి అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అమ్మ కోసం అల్లాడిపోతున్నారు. మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తున్నారు. కాస్త ఊహ తెలిసిన పిల్లలు తల్లి మరణం తెలిసినప్పటినుంచి ఇప్పటి వరకూ కోలుకోనేలేదు. ఈ పిల్లల్లో అందరికంటే చిన్నవాడి వయసు కేవలం ఏడాదే. ఇక తల్లి మరణానికి ముందు పుట్టిన పిల్లాడికి తల్లి లేదని తెలియదుకదా..చక్కగా పాలు తాగి పడుకుంటున్నాడు. కానీ ఏడాది వయస్సున్న పసివాడు మాత్రం తల్లికోసం ఏడవని రోజంటూ లేదు. ఆ పిల్లాడు ఏడుపు వింటుంటే..కన్నీళ్లు ఆగట్లేదంటున్నారు.