us-newyork-a-giant-rat-is-often-seen-taking-the-subway-with-other-passengers

Viral video : ఎలుక గెటప్ తో మెట్రో రైల్ ఎక్కాడు..ఎందుకంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

US new york : ఈ కరోనా కాలంలో జనాలు వింత వింత గెటప్ లతో జనాల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖానికి మాస్కులు తప్పనిసరి అయిన ఈ మహమ్మారి కాలంలో ఒకతను ఏకంగా కొండచిలువ పామునే ముఖానికి చుట్టుకుని బస్సు ఎక్కి జనాల్ని కంగారుపెట్టేశాడు.


మరొ వ్యక్తి డైనోసార్ గెటప్ తో హల్ చల్ చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకునే ఓ వ్యక్తి ఎలుక వేషంలో మెట్రో రైలెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారి చక్కర్లు కొడుతోంది.


వివరాల్లోకి వెళితే..యూఎస్ లోని న్యూయార్క్‌ స్టేషన్‌లో మెట్రో రైలు వచ్చి ఆగింది. అప్పటి వరకూ ఫుట్‌పాత్‌ మీదున్న ఎలుగ వేషం వేసుకున్న ఓ వ్యక్తి వేషధారి రైల్ ఎక్కాడు. ఎలుక ముఖంలా మాస్కు.. వెనుక తోకతో చాలా వింతగా..విచిత్రంగా కనిపించాడు.


నాలుగు కాళ్లమీద అచ్చం ఎలుకలాగా పాక్కుంటూ చకచకా రైలెక్కి సీట్‌పై కూర్చున్నాడు. అంతా ఆశ్చర్యంత అతడిని చూస్తుండిపోయారు.



అతడు మరెవరో ప్రముఖ నాటకరంగ కళాకారుడు జోనాథన్‌ లియోన్స్‌. మాస్కుపై అవగాహన కల్పించేందుకే అలా తయారై వచ్చానని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.

Related Tags :

Related Posts :