లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఇంటిగోడలో పురాతన విస్కీ బాటిళ్లు..షాక్ అయిన దంపతులు

Published

on

US Newyork house in wall Oldest whiskey bottle : కొత్తగా ఇల్లు కొనుక్కుని చక్కగా ఉందామని వచ్చిన దంపతులకు ఆ ఇంటి గోడలో కనిపించిన వస్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఇదేంటీ గోడల్లో ఉంటే గింటే విలువైన వస్తువులు ఉండాలిగానీ ఏంటీ ఇటువంటివికూడా ఉంటాయా? అని నోరెళ్లబెట్టారు ఆ దంపతులు..ఇంతకీ వాళ్లకు గోడలో దొరికిన వస్తువులేంటంటే పురాతనకాలంనాటి విస్కీ బాటిల్స్. గోడలో లభించిన మొత్తం 66 విస్కీ బాటిల్స్ ను వారు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవికాస్తా వైరల్ గా మారాయి.వివరాల్లోకి వెళితే..యూఎస్ లోని న్యూయార్క్ కు చెందిన నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ అనే జంట గత అక్టోబర్‌లో కొత్తగా..ఓ పాత ఇల్లుని ముచ్చటపడి కొనుక్కుని దాంట్లోకి మారారు. కొన్నది పాత ఇల్లు కాబట్టి దాన్నికి రిపేర్లు చేయిద్దామనుకున్నారు. అలా రిపేర్లు చేయిస్తుండగా వారి ఇంటి గోడలో మద్య నిషేద యుగం కాలానికి చెందిన 66 విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. వాటిని చూసినవారు నోరెళ్లబెట్టారు.దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు ? ….. వివాదం రేపిన వీసీల ఎంపిక పరీక్షలో ప్రశ్న


నిక్‌ డ్రమ్మండ్‌ దంపతులు ఈ ఇంటిని ఓ నటోరియస్‌ స్మగ్లర్‌ దగ్గర నుంచి కొన్నారు. 100 సంవత్సరాల నాటి ఇల్లు కావటంతో దాన్ని మోడరన్ గా మారుద్దామని అనుకున్నారు. మరమత్తులు చేసే క్రమంలో ఆ ఇంటి గోడలను బాగు చేయటానికి బాగా పాడైపోయిన ఇంటి గోడల్ని తవ్వారు.ఆ తవ్వకాల్లో వారికి ఓ గోడలోపల వరుసగా పేర్చి ఉంచిన విస్కీ బాటిళ్లు కనిపించాయి. మొదటి ఓ బాటిల్ కనిపించగా అటువంటివి ఇంకా ఉండి ఉంటాయని భావించి వరుసగా గోడను తవ్వగా ఒక్కొటిగా మొత్తం 66 విస్కీబాటిల్స్ బైటపడ్డాయి. ఈ విస్కీ బాటిళ్లు మధ్యనిషేధం నడిచిన 1920 కాలానికి చెందినవిగా గుర్తించారు.వాటిని చూసిన దంపతులిద్దరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకిరమొహాలు మరొకరు చూసుకున్నారు.వెంటనే తేరుకుని తమకు దక్కిన అదృష్టాన్ని తలచుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మా ఇంటిని మద్యం బాటిల్స్ తో నిర్మించారు’ అనే క్యాప్షన్‌తో ఫోటోలని ఫేర్‌ చేశాడు నిక్‌.


వాటి మీద తయారీ తేదీ‌ అక్టోబర్‌ 23, 1923గా ఉంది. మొత్తం 66 బాటిళ్లలో 13 ఫుల్‌గా ఉన్నాయి. మరో తొమ్మిది బాగానే ఉన్నాయి. వాటిలో నాలుగు బాటిల్స్ మాత్రం పాడైపోయాయి. మరికొన్నింటిలో విస్కీ సగమే ఉంది.Old ఇన్నేళ్లు గోడలోపల ఉండటంతో విస్కీ ఆవిరి అయి ఉండవచ్చు అని భావిస్తున్నాడు నిక్‌.

 

View this post on Instagram

 

A post shared by Nick Drummond (@bootleggerbungalow)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *