లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

పెంపుడు కుక్క చనిపోయిందని దేవుడికి ఉత్తరం రాసిన చిన్నారి..చదివితే కన్నీళ్లాగవు..

Published

on

US : Heart Touching Letter to God : ప్రాణంగా పెంచుకున్న కుక్క చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పలేం. ఇంట్లో కాళ్లా వేళ్లా తిరిగే పెట్ డాగ్ దూరమైతే సొంత కుటుంబంసభ్యలు చనిపోయినంత బాధపడిపోతాం. అలా అమెరికన్ పాపులర్ వెబ్సైట్ కోరాలోని ఓ కుటుంబం ‘అబ్బే’ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్క చనిపోయింది. దీంతో ఆ కుక్కతో చక్కగా ఆడుకునే నాలుగేళ్ల చిన్నారి బెంగపడిపోయింది. ఆ కుక్క చనిపోయిననాటినుంచి తిండి తినకుండా ఏడుస్తూనే ఉంది.

ఆ పాప ఏడుపు ఆపటం..ఎవరి వల్లాకాలేదు. ‘అబ్బే అబ్బే అంటూ’ ఒకటే ఏడుపు..దీంతో ఆ పాపతో తండ్రి ‘నీ అబ్బే సంతోషంగా ఉండాలని ‘దేవుడి’ లెటర్ రాయి..దేవుడు అబ్బేని చాలా బాగా చూసుకుంటాడు.ఎటువంటి కష్టం రానివ్వడు..’ అని చెబుతూ ఏడుపు మానిపించటానికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి తండ్రి సహాయంతో ‘‘తన కుక్క గురించి ‘దేవుడికి’ లెటర్ రాసింది.

ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖలోని సారాంశం చదివినివారంతా కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అమెరికన్ పాపులర్ వెబ్సైట్ కోరాలోని ‘హీరోస్ అండ్ దెయిర్ స్టోరీస్’ పేజీలో పోస్ట్ చేయబడ్డ ఈ లేఖ వైరల్ గా మారింది. తన తండ్రి సహాయంతో మెరెడిత్ అనే 4 ఏళ్ల ప్రీ స్కూలర్ దేవుడికి రాసిన లేఖను చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఈ లేఖలో పాపం ఏం రాసిందంటే..‘‘ప్రియమైన దేవుడా..అబ్బే అని పిలుచుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకునే మా పెంపుడు కుక్క చనిపోయింది. మానుంచి దూరమై అబ్బే మీ దగ్గరకొచ్చేసింది. మీరు నా కుక్కను జాగ్రత్తగా చూసుకుంటారా? అది మీతో స్వర్గంలో ఉంది. నేను దాన్ని చాలా చాలా మిస్ అవుతున్నాను. అది అనారోగ్యంతో చనిపోయినా. మీరు నా కుక్కను హక్కున చేర్చుకున్నారు. అందుకు నేను హ్యాపీగా ఉన్నాను. మీరు నా కుక్కతో సంతోషంగా ఆడుకుంటారని నమ్ముతున్నాను. దానికి ఈత కొట్టడం, ఆటలాడటం అంటే చాలా ఇష్టం. నేను నా కుక్క ఫోటోని కూడా ఈ లెటర్ తోపాటు మీకు పంపుతున్నాను. మీరు నా కుక్కను త్వరగా గుర్తుపట్టవచ్చు. ప్రతి రోజూ నాతో ఆడుకునే నా అబ్బే ఇప్పుడు లేకపోవటంతో చాలా బాధగా ఉంది‘‘ అంటూ రాసిన ఈ భావోద్వేగంతో లేఖ నెజిటన్లను కంటతడిపెట్టిస్తోంది.

తాను రాసిన లేఖను పోస్ట్ చేయమని తండ్రి అడిగిన చిన్నారి..
నాలుగేళ్ల చిన్నారి బాధనుతగ్గిద్దామని ఆ తండ్రి చేసిన యత్నం ఫలించే ఉంటుంది. లెటర్ రాసిన తరువాత ఆ చిన్నారి ‘‘డాడీ ఈ లెటర్ ను పోస్ట్ చేయండీ..అంటూ అమాయకంగా అడిగింది. అంటే నిజంగా ఆ లెటర్ దేవుడికి చేరుతుందని తన కుక్కను దేవుడు బాగా చూసుకుంటాడని ఎంతగా నమ్మిందో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు దేవుడితో సమానం అని పెద్దలు అంటుంటారు. అంటే కల్లాకపటం తెలియని చిన్నారులు సాక్షాత్తు భగవంతుడితో సమానమని అర్థం.

లెటర్ రాసిన తరువాత అది స్వర్గానికి వెళ్ళడానికి చాలా స్టాంపులు అవసరం అని తండ్రి చెప్పటంతో స్టాంపులు కూడా అంటించిందా చిన్నారి. తన కుక్క బాగు గురించి ఆ చిన్నారి పడే తపనను చూసిన ఎంతోమంది నెటిజన్లు చలించిపోయారు. ఆ చిన్నారికి తిరిగి సమాధానంగా లెటర్లు రాస్తున్నారు.

తాను లేఖ పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ఆ చిన్నారి ఒక నెటిజన్ నుంచి ప్యాకేజీని అందుకుంది. ఆ ప్యాకేజీలో మిస్టర్ రోజర్స్ రాసిన- ‘వెన్ ఎ పెట్ డైస్’ అనే పుస్తకాన్ని పంపించారు ఆ నెటిజన్. స్వయంగా తన చేతివ్రాతలో రాసిన నోట్‌లో ‘‘మీ కుక్క అబ్బే సురక్షితంగా స్వర్గానికి చేరుకున్నాడని..దాన్ని మేం చాలా ప్రేమగా చూసుకుంటామని ఆ నెటిజన్ పేర్కొన్నాడు. ఇంకా..”నేను మీ లేఖను చదివినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరగాయి. ఇలాంటి యజమాని కలిగి ఉండటం అబ్బే అదృష్టంగా భావిస్తున్నాను. మీ అద్భుతమైన కుటుంబాన్ని ఆ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు’’ అంటూ ఆకాంక్షించాడు.