కరోనాను అంతం చేసే అణువును కనిపెట్టేశారు సైంటిస్టులు..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచాన్ని కాపాడేందుకు సైంటిస్టులు అహో రాత్రుళ్లు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కరోనాను కట్టడి చేసే మందును కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు.. ఇప్పటికే వచ్చిన వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి.. మందులేని కరోనాకు అమెరికా సైంటిస్టులు కొత్త అణువును కనిపెట్టేశారు.. దీని ద్వారా కరోనాను నివారించడమే కాదు.. చికిత్సకు అవసరయ్యే అణువును గుర్తించామని వెల్లడించారు. ఈ అణువు సాయంతో కరోనా డ్రగ్ అభివృద్ధి చేసేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా నిర్వహించనున్నారు.అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అణువును కనిపెట్టారు. కరోనా వైరస్‌ (SARS COV-2ను పూర్తిగా తటస్థం (న్యూట్రిలైజ్‌) చేయగలదని గుర్తించారు. AB8 అని కూడా పిలుస్తారు. కరోనాపై పోరాడే యాంటీబాడీస్‌ను శరీరంలో డెవలప్ చేస్తుందని అంటున్నారు. ఎలుకలు, చిట్టెలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో సైంటిస్టులు మరింత లోతుగా అధ్యయనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.నాసల్‌ స్ప్రే రూపంలో కూడా తీసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. FDA అనుమతి రాగానే క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ డ్రగ్ ధర అందరికి అందుబాటులోనే లభ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంతో పవర్ పుల్, సమర్థవంతంగా కరోనా వైరస్ మహమ్మారిపై ప్రభావంతంగా పోరాడగలదని అంటున్నారు.

Related Posts