లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

రూ.500ల బిల్లుకి రూ.2 లక్షలు టిప్పు ఇచ్చిన కష్టమర్..

Published

on

US Cleveland Nighttown Restaurant : హోటల్ కు వచ్చిన కష్టమర్ ఇచ్చే టిప్ కోసం సర్వ్ చేసిన బేరర్లు ఆశగా ఎదురు చూస్తుంటారు. అలా కష్టమర్లు తమకు పెద్ద మొత్తంలో టిప్ ఇస్తే సంతోషపడిపోతారు. థాంక్యూ సార్..అని కృతజ్ఞతలు తెలుపుతారు. అలా ఓ రెస్టారెంట్ కు వచ్చిన ఓ కస్టమర్ తన బిల్ కు ఊహించనంత రెట్లు బిల్ ఇస్తే ఆ సర్వర్ కు సంతోషానికి పట్టపగ్గాలుండవ్.అటువంటి ఘటన యూఎస్ క్లీవ్ లాండ్ లోని ఓ రెస్టారెంట్ లో ఓ కష్టమర్ ఇచ్చిన బిల్లు చూసి రెస్టారెంట్ యజమాని కళ్లు తేలేశాడు. ఆ కష్టమర్ కు అయ్యింది కేవలం 7 డాలర్లు. కానీ టిప్ మాత్రం ఏకంగా 3వేల డాలర్లు ఇచ్చాడు. దీంతో షాక్ అవ్వటం ఆ యాజమాని వంతు అయ్యింది.నష్టం బీఎంసీ ఇవ్వాలి, కంగనా ఇల్లు కూల్చివేతపై హైకోర్టు విచారణ


వివరాల్లోకి వెళితే..అది యూఎస్ లోని ఓహియో రాష్ట్రం లోని క్లీవ్‌లాండ్‌ నగరంలోని ‘‘నైట్ టౌన్’’ రెస్టరెంట్‌. ఆ రెస్టారెంట్ కు గత ఆదివారం (నవంబర్ 22,2020) ఓ కస్టమర్‌ వచ్చాడు. 7 డాలర్ల బిల్ అయ్యింది. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు 500 రూపాయలు. బిల్ కట్టేసమయంలో ఆ బిల్లుకి 3,000 డాలర్ల (దాదాపు రూ. 2.21 లక్షలు) టిప్పు కలిపి మొత్తం 3,007 డాలర్లు చెల్లించాడు.


అది చూసిన రెస్టరెంట్‌ యజమాని బ్రెండన్‌ రింగ్‌ షాక్ అయ్యాడు. పొరపాటున ఆ కష్టమర్ అలా చేసుంటాడని అనుకున్నాడు. ఈ సందర్భంగా బ్రెండన్ రింగ్ మాట్లాడుతూ..ఓహియోలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మా రెస్టరెంట్‌ను జనవరి వరకూ మూసివేయాలనుకున్నామనీ..ఇదే చివరి రోజు ఇక రేపటి నుంచి రెస్టారెంట్ క్లోజ్ చేద్దామని అనుంకుటున్నాం. ఇదే చివరి రోజు కావడంతో ఆదివారం రెస్టరెంట్‌ కష్టమర్లతో బాగా రద్దీగా ఉంది.


ఆ సమయంలో అప్పుడప్పుడు మా రెస్టారెంట్ కు వచ్చి ఒక కస్టమర్‌ లోపలికొచ్చి..ఒక స్టెల్లా డ్రింక్‌ ఆర్డర్‌ చేశారు. రెండే రెండు సిప్పులు తాగి..నాకు బిల్ ఇవ్వండి అని అడిగారు. దానికి బిల్ తీసుకుని ఆయన టేబుల్‌ వద్దకొచ్చిన బిల్లు ఇచ్చాను. అతని ఆ బిల్ తో పాటు టిప్ కూడా ఇస్తూ..‘‘గుడ్‌లక్‌..అంతా మంచే జరగాలి.. మళ్లీ కలుద్దాం!’’ అని వెళ్లిపోయాడాయన.ఆయన వెళ్ళాక ఆ బిల్లుపై టిప్పు ముందు 300 గా మసకమసగ్గా కనిపించింది. దాంతో షాక్ అయిన రింగ్ వెంటనే తన కళ్లజోడు పెట్టుకుని మరీ చూశాడు. అది నిజంగానే 3,000 అని ఉంది. దాంతో ఆ కష్టమర్ పొరపాటున అలా ఇచ్చారేమోనని వెంటనే బయటకు పరుగు తీసి అతన్ని కలిసాను. సార్..మీరు పొరపడినట్లున్నారు. పొరపాటున 3వేల డాలర్లు అని అంటుండగా..అందుకతను ‘‘లేదు. తెలిసే ఇచ్చాను. ఈ ఎమౌంట్ ని మీ రెస్టారెంట్ లో పనిచేస్తున్న అందరూ షేర్ చేసుకోండి. మెరీ క్రిస్‌మస్‌’’ అని చెప్పి వెళ్లి పోయాడని రింగ్ తెలిపాడు. దీంతో అతని పెద్ద మనస్సు కు ధన్యవాదాలు తెలిపి..ఆ రోజు నలుగురు డ్యూటీలో ఉన్నవారందకినీ తలా తలా 750 డాలర్లు ఇచ్చానని తెలిపాడు.కాకపోతే తన పేరు బయటపెట్టొద్దని ఆ కస్టమర్‌ కోరాడని బ్రెండెన్ రింగ్‌ తెలిపాడు. ఈ సంఘటన పేపర్లో రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ‘అజ్ఞాత’ కస్టమర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన సోదరి కూడా ఈ విషయాన్ని పేపర్లో చదివిందని చాలా చాలా సంతోషంగా చెప్పాడు రింగ్. ప్పాడు రింగ్‌.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *