Home » కరోనా రోగిని కౌగలించుకున్న డాక్టర్ : నీకు నేనున్నానంటూ ధైర్యం
Published
2 months agoon
By
nagamaniUS Texas : houston doctor hugging corona patient : కరనా సోకిందని తెలిస్తే చాలా ఆమడదూరాన్ని ఉండిపోతున్న రోజులు. డాక్టర్లైనా, మెడికల్ సిబ్బంది అయినా సరే రోగులకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే సేవలందిస్తుంటారు. అటువంటిదో ఓ డాక్టర్ ఏకంగా కరోనాతో బాధపడే ఓ రోగిని కౌగలించుకుని ధైర్యం చెప్పారు.
దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు ఆ డాక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోగులకు..ముఖ్యంగా కరోనా సోకినవారికి వైద్యం కంటే..మానసిక ధైర్యం చాలా అవసరమనీ..అదే ఆ డాక్టర్ ఆరోగికి అందిస్తున్నాడనీ..ప్రశంసిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..యూఎస్ టెక్సాస్ లోని హూస్టన్‌లో యునైటెడ్ మెమోరియల్ మెడికల్ సెంటర్లో డాక్టర్ జోసెఫ్ వరోన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేస్తున్నారు. 252 రోజులుగా కరోనా బాధితుల సేవలోనే ఆయన నిత్యం అంకిత భావంతో పనిచేస్తున్నారు. కరోనా సోకినవారిని ఆదరంగా పలకరిస్తు ధైర్యాన్ని నింపుతున్నారు. డాక్టర్ జోసెఫ్ అంటే ఆ హాస్పిటల్లో సిబ్బందితో పాటు పేషెంట్లు కూడా చాలా గౌరవం చూపిస్తుంటారు.
ఈక్రమంలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా తనకు సెలవు ఉన్నప్పటికీ డాక్టర్ జోసెఫ్ వరోన్ పీపీఈ కిట్ ధరించి..డ్యూటీకే అంకితమయ్యారు. అలాగఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడు తన కష్టాలు చెప్పుకున్నాడు. తీవ్ర ఆవేదన చెందుతు కుమిలిపోతున్నాడు. అతన్ని అలా చూసిన డాక్టర్ జోసెఫ్ చలించిపోయారు.
వెంటనే ఆ బాధితుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి..ఆ ఫొటో వెంటనే సోషల్ మీడియాలో పెట్టటంతో డాక్టర్ జోసెఫ్ పెద్ద మనస్సు లోకానికి తెలిసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. రోగులకు ఇటువంటి డాక్టర్లే కావాలని ప్రశంసలు కురిపిస్తున్నారు.