పుట్టిన రోజు నాడే తుపాకీతో కాల్చుకుని చనిపోయిన మూడేళ్ల పిల్లాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

us 3 years barthday body dise : అమెరికాలో తుపాకుల సంస్కృతి మూడేళ్ల పిల్లాడి ప్రాణాలు తీసింది. అభం శుభం తెలియని పసివాడు తన పుట్టిన రోజు వేడుకల్లోనే తనకు తానే తుపాకీతో కాల్చుకున్న ఘటనతో సంబరంగా జరిగే పార్టీ అంతా విషాదం నిండుకుంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పుట్టి మూడో పుట్టిన రోజు వేడుకలు కూడా పూర్తికాలేదు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అంటూ విలపించారు.


అమెరికాలోని హూస్టన్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని పోర్టర్ పట్టణంలో గత శనివారం (అక్టోబర్ 25,2020) టెక్సాస్ నగరానికి చెందిన మూడేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలు ఓ ఇంట్లో అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. పిల్లలు..పెద్దలతో సంతోషమంతా అక్కడే ఉందా? అన్నట్లుగా సంబరంగా జరుగుతున్నాయి. బాబు కేక్ కటింగ్ అయిపోయింది. పిల్లలంతా రంగు రంగుల బెనూన్లతో ఆడుకుంటున్నారు. పెద్దలంతా పేకాటలు ఆడుకుంటూ జోకులేసుకుంటున్నారు.


అంతలో ‘‘ఢాం’’అంటూ తుపాకీ పేలిన శబ్ధం వినిపించింది. అందరూ హడలిపోయారు. ఆడుకునే పిల్లలంతా వారి వారి తల్లిదండ్రుల దగ్గరకొచ్చేసి భయం భయంగా చూస్తున్నారు. పెద్దలు తుపాకీ శబ్దం వినిపించిన రూమ్ లోకి వెళ్లి కూడగా అక్కడ కనిపించిన దృశ్యానికి చలించిపోయారు. ఓ మైగాడ్ అంటూ గుండెలు పట్టేసుకున్నారు. అప్పుడే కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ తో ఆడుకున్న మూడేళ్ల ‘‘బర్త్ డే బోయ్’’ఛాతీలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు.


దీంతో వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయగా..వచ్చిన అంబులెన్స్ లో బాలుడిని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆ పసివాడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. మోంట్గో మేరి కౌంటీ షెరీఫ్ అధికారులు ఈ విషయాన్ని దృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బర్త్ డే పార్టీకి వచ్చిన బంధువుల జేబులో నుంచి పడిపోయిన పిస్టల్ ను బాలుడు తీసుకొని..ఏం జరుగుతుందో తెలియని అమాయకత్వంతో కాల్చుకున్నట్లు అధికారులు చెప్పారు.


అమెరికాలో ఇలా పిస్టళ్లతో కాల్చుకోవడం వల్ల 97 మంది పిల్లలు మరణించారని గ్రూప్ ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ అధికారి చెప్పారు. అమెరికాలో మూడవ వంతు మందికి తుపాకులున్నాయి. అందులోనూ టెక్సాస్ ఎక్కువ తుపాకులున్న రాష్ట్రాల్లో ఒకటి. బాలుడి జన్మదినోత్సవం రోజే బుల్లెటుకు బలికావడంతో ఆ ఇంట్లో విషాదం అలముకుంది. ముద్దులొలికే మూడేళ్ల పిల్లాడిని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల్ని ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు. అప్పటి దాకా పండుగలా సంతోషంగా ఉన్న చోట మృత్యుచారికలు అలముకున్నాయి.


కాగా అమెరికాలోనే శుక్రవారం (అక్టోబర్ 9,2020) రాత్రి 9:49 గంటలకు ఇటువంటి ఘటనే జరిగింది. ఒరెగాన్‌లోని అలోహాకు చెందిన జేమ్స్ కెన్నెత్ లిండ్‌క్వెస్టర్ అనే 3 ఏళ్ల బాలుడు బెడ్‌రూమ్‌లో చేతి తుపాకీని పట్టుకుని ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకుని మరణించాడు. ఈ విషయాన్ని వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

Related Tags :

Related Posts :