లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అమెరికాలో ‘కమలం’ హవా..ఆమె వేసుకునే సాక్స్ కు డిమాండ్..తెగ కొనేస్తున్నారట

Updated On - 10:35 am, Tue, 19 January 21

US Kamala Craze : అమెరికాలో కమలా హారిస్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆమే డ్రెస్సింగ్ నుంచి ఆమె కాళ్లకు వేసుకునే సాక్సుల వరకూ యమా క్రేజ్ పెరిగిపోయింది. యూఎస్ ఎన్నికల్లో విజయం సాధించిన కమలాహారిస్ వేసుకునే సాక్సులకు ఇప్పుడు తెగ డిమాండ్ పెరిగిపోయింది. జనాలు ఏరి కోరి కమలా హారిస్ వేసుకేనే సాక్సుల బ్రాండ్ వంటివే ఎగబడి మరీ కొనేస్తున్నారట.

సాధారణంగా సినిమా హీరోలు, సెలబ్రిటీలను ప్రజలు ఫాలో అవుతుంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు ఏ కాస్ట్యూమ్స్ వాడితే… ఫాన్య్ కూడా వాటిని వాడేందుకు ఇష్టపడతారు. కానీ రాజకీయ నాయకులకు కూడా ఫాలో వర్స్ ఉండటం విశేషమే. రాజకీయ నాయకుల డ్రెస్సింగ్ విషయంలో ఫాలోయింగ్ చాలా ఉండదనే చెప్పాలి. కానీ అమెరికాలో మాత్రం కొత్త ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భారత సంతతి వనిత కమలా హారిస్‌కి క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే… ఆమె వేసుకునే సాక్స్‌ని కూడా ఎగబడి కొంటున్నారు ప్రజలు. ఆమె వేసుకునే బ్రాండ్ కు క్రేజ్ పెరిగింది. దీంతో ఆ కంపెనీ పండగ చేసుకుంటోంది.

కమలా హారిస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆమె ఏనాడూ తన డ్రెస్సింగ్ వంటి వ్యక్తిగత విషయాల గురించి కాకుండా కేవలం రాజకీయ అంశాలపైనే పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో హారిస్ మేనకోడలు మీనా హారిస్… ఓ వీడియోని టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో కమలా హారిస్‌కి పీచ్ పండ్ల ఫ్లేవర్ ఉన్న మింట్స్ జార్ ఇచ్చారు. అలా ఇస్తూ… ఇం”పీచ్‌””మింట్స్”(Im-peach-mints) అనే పదాన్ని వాడారు.

మొదట ఆ ఇంపీచ్‌మింట్స్ పదానికి ఉన్న అర్థాన్ని కమలా హారిస్ గుర్తించలేదు. వెంటనే గుర్తించి… పకపకా నవ్వేశారు. ఇంపీచ్‌మెంట్ అంటే అభిశంసన. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తుచేస్తూ మీనా హారిస్… ఇలా పీచ్ పండ్ల ఫ్లేవర్ మింట్స్ ఇచ్చి… సెటైర్ వేశారన్నమాట.

ఈ టిక్ టాక్ వీడియోని కోటి మందికి పైగా చూశారు. ఇదే వీడియోను మీనా… ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఇది చూసిన వారంతా నవ్వుతున్నారు. అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఐతే… ఈ వీడియోలో కమలా హారిస్ వేసుకున్న సాక్స్ పై ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్ ( అంటే భవిష్యత్తు మహిళలదే) అనే డైలాగ్ ఉంది. ఈ సాక్స్‌ని గంబాల్ పూడిల్ కంపెనీ తయారుచేసింది.

వీటి విలువ 13 డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో రూ.951. హారిస్ వేసుకున్న ఈ సాక్సులకు తెగ డిమాండ్ పెరిగిపోయింది. ఈ సాక్స్‌ని ఇప్పుడు అమెరికన్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెగ కొనేస్తున్నారట. ఎంతగా అంటే… ఆర్డర్ వచ్చిన వెంటనే డెలివరీ చేయలేని పరిస్థితికి ఆ కంపెనీ వచ్చేసింది. ఉన్న స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే..కమలా హారిస్ వేసుకున్న సాక్సులకు ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే..అధ్యక్షుడు జో బిడెన్ కంటే కమలా హారిసే అమెరికాలో ట్రెండ్ అవుతున్నారు. ఆమెకు భారతీయుల సపోర్ట్ బాగా ఉండటంతో… ఇండియాలోనూ ఆమెకు కోట్ల మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఆమె ఏం చేసినా అదో ట్రెండ్ గా సెట్ అయిపోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Meena Harris (@meena)