US warns Pakistan over Terrorism

భారత్ జోలికెళితే తాటతీస్తా : పాక్‌కు అమెరికా వార్నింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇంకోసారి భారత్‌పై ఉగ్రదాడి జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్‌పై గట్టిగా పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందన అమెరికా పాక్‌కు స్పష్టం చేసింది. జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా లాంటి ఉగ్ర సంస్థ‌ల‌ను సంపూర్ణంగా మట్టుబెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైట్‌హౌజ్ అధికారులు వెల్లడించారు.

మ‌రోసారి భార‌త్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగితే, మ‌ళ్లీ రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని, అప్పుడు రెండు దేశాల‌కు ప్ర‌మాదం ఉంటుంద‌ని అమెరికా అధికారి చెప్పారు. బాలాకోట్ దాడి త‌ర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఏమైనా చ‌ర్య‌లు తీసుకుందా అన్న ప్ర‌శ్న‌కు సమాధానం ఇచ్చిన అమెరికా అధికారులు.. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల నిర్మూలనకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను ఇప్పుడు అంచ‌నా వేయ‌లేమ‌ని, ప్ర‌స్తుతానికి ఉగ్ర సంస్థ‌ల ఆస్తుల‌ను సీజ్ చేశార‌ని స్పష్టం చేశారు. 

అలాగే కొంద‌రు ఉగ్ర‌వాదుల‌ను కూడా అరెస్టు చేసి, జైషే స్థావ‌రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంద‌దని చెప్పారు. పాకిస్తాన్ ఇంకా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, అందుకోసం అంత‌ర్జాతీయ దేశాల‌తో క‌లిసి అమెరికా పాకిస్తాన్‌ను ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

Related Tags :

Related Posts :