లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

పాతిపెట్టిన పిల్లి కళేబరాన్ని తీసి వండుకుని తినేసిన మహిళా రాపర్..మనిషివేనాని తిట్టి పోస్తున్న అభిమానులు

Published

on

us women rapper azealia dig up and cook dead cat : ప్రాణంగా చూసుకునే పెంచుకునే జంతువులు చనిపోతే సొంత మనుషులే చనిపోయినంతగా బాధపడతాం. కొంతమందైనే వారి పెంపుడు జంతువులు చనిపోతే వాటికి మనుషుల్లాగే దినకర్మలు చేసి అన్నదానం చేసి వాటిమీద ఉన్న ప్రేమను చూపించుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తాను పెంచుకున్న పిల్లి చనిపోతే బాధపడిందో లేదో తెలీదు గానీ దాన్ని చక్కగా వండుకుని తినేసింది..!! ఏంటీ నిజమా? మరీ ఇంత దారుణమా? అని కోపం వస్తుంది కదూ..నిజమే..

అమెరికాకు చెందిన మహిళా రాపర్ తను పెంచుకున్న పిల్లి చనిపోతే దాన్ని వండుకుని మరీ తినేసింది. అక్కడితో ఊరుకోకుండా తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా తన సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు నెజిన్లంతా తిట్టిపోస్తున్నారు. నువ్వసలు మనిషివేనా? అని దుమ్మెత్తిపోస్తున్నారు..దీంతో ఆమె ఆ వీడియోలను తీసేసింది.

అమెరికాకు చెందిన 29 ఏళ్ల రాపర్ అజీలియా బ్యాంక్స్. ఆమె 2009లో పుట్టిన ఓ పిల్లిని పెంచుకుంటోంది. దానికి ‘లుసీషర్’ అని పేరు పెట్టి పెంచుకుంటోంది. అలా 2020 వరకూ ఆ పిల్లిని అజీలియా ప్రేమగా పెంచుకుంది. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం లుసీషర్ చనిపోయింది. దీంతో అజీలియా ఆ పిల్లిని భూమిలో పాతి పెట్టి..పైన మట్టి కప్పి..నా ప్రియమైన పిల్లి చనిపోయింది. ఐ మిస్ యూ అంటూ దానికి నివాళులర్పించింది.

ఇంత వరకూ బాగానే ఉంది. అంతటితో ఊరుకుంటే అది వార్త అయ్యేది కాదు. అలా పాతిపెట్టిన పిల్లి కళేబరాన్ని బైటకు తీసి వండుకుని తినేసింది. దీనికి సంబంధించి అజీలియా ఓ వీడియో కూడా చేసింది. పిల్లిపైన కప్పి పెట్టిన మట్టిపై కప్పి ఉన్న పువ్వులను పక్కకు తొలగించి.. భూమిలో పాతివున్న పిల్లి కళేబరాన్ని బయటకు తీసింది. ఆ తర్వాత దాన్ని వండుకుని తినేశానని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.

‘‘ఈ బ్యాగ్‌లో నా ప్రియమైన పిల్లి లుసీషర్ ఉంది. 2009లో పుట్టి 2020లో చనిపోయింది’’ అని చెబుతూ.. అనంతరం భూమి నుంచి బయటకు తీసిన పెద్ద కుండను తీసి పిల్లిని అందులో వేసి ఉండకబెట్టడం వీడియోలో కనిపించింది. అనంతరం దాన్ని తింటున్నట్లు అప్‌డేట్స్ కూడా పెట్టింది. దీంతో ఆమె అభిమానులతో పాటు నెటిజనులు ఆమెను తిట్టిపోశారు. దీంతో ఆ పోస్టులను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించేసింది.

పెంపుడు పిల్లితో ఇంత దారుణంగా వ్యవహరించటంతో ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. ‘‘నీకు మతి పోయిందా?నువ్వసలు మనిషివేనా?’’ అంటూ కామెంట్లతో తిట్ల వర్షం కురిపించారు. కాగా..గతంలో కూడా అజీలియాపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. 2016లో అజీలియా మంత్రగత్తెలా ఇంట్లోనే కోళ్లను బలిచ్చి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు పిల్లిని వండి మరోసారి అభిమానులతో పాటు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *