USA, again, recorded 44,450 new corona cases while 337 deaths

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 44,450 కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచానికే పెద్దన్నగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా కరోనా కారణంగా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి. కరోనా కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకోగా.. అంటువ్యాధి ఇప్పటికీ భయపెడుతుంది. ఈ క్రమంలోనే సోమవారం(29 జూన్ 2020) కొత్తగా దేశంలో 44,450 కేసులు నమోదయ్యాయి. 337 మంది చనిపోయారు. అయితే, అమెరికా కంటే ప్రతిరోజూ బ్రెజిల్‌లో ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.

యుఎస్‌లో ఇప్పటివరకు 128,774 మంది మరణించారు..
వరల్డ్ మీటర్ ప్రకారం, అమెరికాలో కరోనా వైరస్ రోగుల సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 26 లక్షల 81 వేలకు పెరిగింది. మొత్తం 1 లక్ష 28 వేల 774 మంది మరణించారు. అయితే, 11 లక్షల 06 వేల మంది కూడా కోలుకున్నారు, ఇది మొత్తం కరోనా సోకిన వారిలో 41 శాతం. ప్రస్తుతం 14 లక్షల 46 వేల మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇది మొత్తం సోకిన వారిలో 54 శాతం. యుఎస్‌లో, కరోనా సోకిన వారిలో 5 శాతం మంది మరణించారు.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యధికంగా 417,328 కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌లో మాత్రమే 31,496 మంది చనిపోయారు. దీని తరువాత, కాలిఫోర్నియాలోని 222,985 కరోనా రోగులలో 5,976 మంది మరణించారు. ఇవి కాకుండా, న్యూజెర్సీ, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, ఫ్లోరిడా కూడా ఎక్కువగా ప్రభావితం అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. మరణించిన వారి సంఖ్య ఐదు లక్షలకు పెరిగింది. బాధిత దేశాల జాబితాలో 2,681,527 కేసులు, 128,774 మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 1,370,488 కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ మరణించిన వారి సంఖ్య 58,385.

కేసుల్లో రష్యా మూడో స్థానంలో (641,156), తర్వాత భారత్ (567,536), బ్రిటన్ (311,965), స్పెయిన్ (296,050), పెరూ (282,365), చిలీ (275,999), ఇటలీ (240,436), ఇరాన్ (225,205), మెక్సికో (216,852), పాకిస్తాన్ (206,512), టర్కీ (198,613), జర్మనీ (195,392), సౌదీ అరేబియా (186,436), ఫ్రాన్స్ (164,260), దక్షిణాఫ్రికా (144,264), బంగ్లాదేశ్ (141,801), కెనడా (103,918).

పది వేల మందికి పైగా మరణించిన దేశాలు బ్రిటన్ (43,575), ఇటలీ (34,744), ఫ్రాన్స్ (29,813), స్పెయిన్ (28,346), మెక్సికో (26,648), భారతదేశం (16,904) మరియు ఇరాన్ (10,670).

Read:సోలైమాని హత్య ఘటనపై ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్..!