లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఆ మట్టి ఖరీదు రూ.11లక్షలు : నాలుగు కంపెనీలతో నాసా ఒప్పందం

Published

on

USA : NASA Buying moon dust 15000 dollars : ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు..విశేషాలు..రహస్యాలు. అటువంటి రహస్యాలను ఛేదించటానికి మనిషి నిరంతరం యత్నిస్తునే ఉన్నాడు. కొన్నింటిని ఛేధించాడు కూడా. అందాల చంద్రమామను అందుకున్నాడు. చందమామపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తునే ఉన్నాడు.ఇదిలా ఉంటే అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా చంద్రుడిపై ఉండే మట్టిని కొనటానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రుడిపై ఉండే ఆ మట్టి లక్షల విలువ చేస్తుంది. చంద్రుడి మీద మట్టి కొనటానికి నాసా 15 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో 11,05,803 రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే మట్టిని కొనటానికి నాసా ఇప్పటికే నాసా నాలుగు ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సదరు కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని సేకరించి నాసాకు అప్పగించేందుకు యత్నాలు మొదలుపెట్టాయి. ఈ విషయంపై నాసా కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ డివిజన్ డైరెక్టర్ ఫిల్ మక్అలిస్టర్న్‌ మాట్లాడుతూ..”చంద్రుడిపై మట్టిని తీసుకువచ్చేందుకు మేము నాలుగు కంపెనీలతో ఒప్పందంకుదుర్చుకున్నామని తెలిపారు. దాని కోసం 25,001 డాలర్లకు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే వాటిని కొనుగోలు చేయనున్నామని AFP వార్తా సంస్థకు తెలిపారు.ఈ ఒప్పందలో లునార్‌ అవుట్‌పోస్ట్‌ ఆఫ్‌ గోలెడ్న్‌, కొలరాడోతో ఒక్క డాలర్‌కు ఒప్పందం కుదుర్చుకోగా.. టోక్యోకు చెందిన ఇస్పేస్ జపాన్‌తో 5,000 డాలర్లకు.. లక్సెంబర్గ్ ఐస్పేస్ యూరప్‌తో మరో 5,000 డాలర్లకు..కాలిఫోర్నియాలోని మోజావే మాస్టెన్ స్పేస్ సిస్టమ్స్‌తో 15,000 డాలర్లకు నాసా ఒప్పందం కుదుర్చుకుంది.


ఇక 2022-23 సంవత్సారల్లో ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని తెచ్చి నాసాకు అప్పగిస్తాయి. ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే ఈ మట్టిని ‘రెగోలిత్’‌ అంటారు. మట్టితో పాటు దాని సేకరణ, సేకరించిన పదార్థాలకు సంబంధించిన చిత్రాలను కూడా అందిస్తాయి.ఈ మట్టిని నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏకైక భాగస్వామిగా వినియోగించనుంది. అయితే ఈ మట్టిని భూమికి తీసుకువస్తారా లేదా అనే దాని గురించి ఎటువంటి స్పష్టత లేదు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నాసా 2024 నాటికి స్త్రీ, పురుషిలిద్దరిని చంద్రుడి మీదకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఫలితాల ఆధారంగా అంగారక గ్రహంపై కాలు మోపాలని భావిస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *