ఆర్థికంగా నష్టపోయారట, మానసికంగా డిస్ట్రబ్ అయ్యారట.. రెస్ట్ కావాలంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వైరాగ్యం వచ్చేస్తోందంట. పార్టీని నడిపించడం చాలా కష్టమైపోతుందనే అభిప్రాయంలో ఉన్నారట. గత ఐదేళ్లుగా టీపీసీసీ చీఫ్‌ పదవిలో ఉత్తమ్‌ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఒకే రాష్ట్రానికి ఐదేళ్ల పాటు పార్టీ పగ్గాలు కాంగ్రెస్‌ చరిత్రలో ఎవరికి అప్పజెప్పలేదు. సుదీర్ఘకాలం టీపీసీసీ చీఫ్‌గా కొనసాగి ఉత్తమ్‌ రికార్డ్‌ సృష్టించారు.

కానీ, పార్టీని మాత్రం అధికారంలోకి తేవడంలో విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తన భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోవడంతో మానసికంగా కాస్త డిస్టబ్ అయ్యారట. అంతే తనను కలిసిన సన్నిహితుల వద్ద ఆర్థికంగా చాలా నష్టపోయానని చెబుతున్నారట ఉత్తమ్‌.

కరోనా కారణంగా పదవిలో కంటిన్యూ:
తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటం, పార్టీని మోయడం ఆర్థికంగా కాస్త భారం అవుతుండటంతో స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించారని టాక్‌. అందులో భాగంగా గత పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను కూడా ఇచ్చేశారట. ఇంతలో కరోనా రావడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ పదవిలో కొనసాగాల్సి వస్తోందని చెబుతున్నారు.

తప్పుకోవడమే బెటర్‌ అనుకుంటున్నారట:
చాలా కాలంగా పీసీసీ చీఫ్‌ను మారుస్తారనే టాక్‌ నడుస్తోంది. కానీ, వివిధ కారణాల వల్ల ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే కొనసాగిస్తోంది అధిష్టానం. ఒక దాని వెంట ఒకటి ఎన్నికలు రావడంతో ఆయననే కొనసాగించింది. ఆ తర్వాత మారుద్దామనుకుంటే కరోనా వ్యాప్తి తీవ్రమైంది. దీంతో ఇప్పటికీ ఆయననే కంటిన్యూ చేస్తోంది అధిష్టానం. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిసైడ్‌ అవ్వడమే బెటర్‌ అనుకుంటున్నారట.

ఉత్తమ్‌ కోరుకుంటున్న రెస్ట్‌ దొరికేదెప్పుడు:
అధిష్టానం తరఫున దూతలు సెప్టెంబర్‌ లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకునే అవకాశముందని అంటున్నారు. ఆ సందర్భంగా సరైన నేతను ఎన్నుకోవాలని భావిస్తోందట. తెలంగాణలో పార్టీ బాధ్యతలు మోసేందుకు చాలామంది పోటీ పడుతున్నా పరిస్థితులు మరోలా ఉన్నాయి. అక్కడ జాతీయ స్థాయిలో కూడా పార్టీ సంక్షోభంలో ఉంది.

పార్టీ నాయకత్వంపై ముఖ్యంగా సోనియాకు వ్యతిరేకంగా సీనియర్లు లేఖ రాయడం సంచలనం అయ్యింది. దీంతో ఇక్కడ కూడా కొన్నాళ్లు వేచి చూసే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి పరిస్థితులన్నీ చక్కబడేదెప్పుడు? ఉత్తమ్‌ కోరుకుంటున్న రెస్ట్‌ దొరికేదెప్పుడనే చర్చ జరుగుతోంది.


Related Posts