లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

5 ఏళ్ల బాలికపై అత్యాచారం…..రక్తస్రావం ఆగటానికి ఇంజనాయిల్ పోసిన కిరాతకుడు

Published

on

5 Year Old girl Raped By Uncle : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. 5 ఏళ్ల చిన్నారిపై మావయ్య వరసయ్యే 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయటం వల్ల బాలికకు విపరీతంగా రక్తస్రావం జరిగింది. అది ఆపటానికి కిరాతకుడు బాలిక మర్మాంగాల్లో ఇంజన్ ఆయిల్ పోసాడు.

ఉత్తర ప్రదేశ్ లోని బుద్వాన్ జిల్లా , హజరత్పూర్ గ్రామంలో అక్టోబర్7 బుధవారం సాయంత్రం ఇంటి వద్ద తనతోటి పిల్లలతో 5 ఏళ్ల బాలిక ఆడుకుంటోంది. ఆ సమయంలో మావయ్య వరసయ్యే 35 ఏళ్ల వ్యక్తి ఆమెను తన ఇంటికి పిలుచుకు వెళ్లాడు. ఇంట్లో బాలికపై అత్యాచారం చేశాడు.అత్యాచారం చేయటంతో బాలికకు తీవ్రంగారక్త స్రావం అయ్యింది. రక్త స్రావం ఆపటానికి Mobil ఇంజన్ ఆయిల్ ను బాలిక మర్మాంగాల్లో పోశాడు. అనంతరం బాలిక ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలికకు పొత్తి కడుపులోవిపరీతమైన నొప్పి రావటం మొదలైంది. దీంతో తన తల్లికి జరిగిన విషయం చెప్పటంతో…. కీచకుడు చేసిన పని వెలుగులోకి వచ్చింది.

వారు వెంటనే స్దానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం బాలికను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడిపై పోక్సో, ఐపీసీ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ. 3లక్షల రూపాయలు సాయం ప్రకటించింది.బాలిక తల్లితండ్రులు బీదవారు కావటంతోవారికి సేద్యం చేసుకోటానికి వ్యవసాయ భూమి ఇచ్చేలా సాయం చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ ప్రశాంత్ తెలిపారు. నిందితుడు నేరం చేసాడనటానికి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ వేగంగా జరిగేలా చూస్తామని…నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ చెప్పారు. బాలిక ఆరోగ్యం స్ధిరంగా ఉందని ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయన వివరించారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *