లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

5 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన 7 ఏళ్ల పిల్లాడు: ఈ దారుణం కూడా అక్కడే

Published

on

Uttar Pradesh : 7 year old boy sexually abuses minor girl in Aligarh : ఏదైనా జరగరానికి జరిగితే ‘‘కలికాలం’’ అంటారు పెద్దలు. చిన్నపిల్లలు చేయకూడని పనులు చేస్తే ‘‘ పిదపకాలం పిదప బుద్దులు’’ అని కూడా అంటారు. ఘోరమైన ఘటనలు జరిగితే పాపిష్టికాలం అంటాం. ఇదిగో ఈ ఘటన అటువంటిదే. ఇది తెలిసాక కలికాలం అంటారో..పిదపకాలం పిదప బుద్దులు అంటారో..పాపిష్టి కాలం అంటారో మీ ఇష్టం..అదేమంటే..5 ఏళ్ల చిన్నారిని 7 ఏళ్లున్న పిల్లాడు లైంగికంగా వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో చోటుచేసుకుంది.


అలీగఢ్ కు చెందిన 5ఏళ్ల బాలిక..గత సోమవారం (అక్టోబర్ 12,2020)న తన ఇంట్లో బంతి ఆట ఆడుకుంటోంది. కరోనా పుణ్యమాని స్కూల్స్ కూడా లేకపోవటంతో ఇంట్లోనే ఉండి బంతి ఆటాడుకుంటోంది. అలా ఆడుకుంటుండగా బంతి ఎగిరి పక్కింట్లో పడింది. బంతి తెచ్చుకుందామని ఆ చిన్నారి పక్కింటిలోకి వెళ్లింది. అక్కడు ఉన్న ఓ 7 ఏళ్ల బాలుడు.. ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.


ఆ బాలికను గట్టిగా పట్టుకుని.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఏవేవో చేశాడు. ఏం చేశాడో తెలీని ఆ చిన్నారికి అదేదో ఇబ్బందిగా..ఎప్పుడూ జరగనిదిగా ఇబ్బందిగా అనిపించింది. దీంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఆ పిల్లాడిని వదిలించుకుని పారిపోయింది. ఇంట్లోకి వెళ్లి జరిగిన విషయాన్ని అమ్మానాన్ననలతో చెప్పింది. అది విన్నవాళ్లు ఏం చేయాలో కూడా తెలీక షాక్ అయ్యారు. షాక్ నుంచి కోలుకుని ఏం చేశాడని అడిగారు. దానికి ఆ చిన్నారి చేతులతో ఎక్కడెక్కడ పట్టుకున్నాడో చెబుతుంటే తల్లిదండ్రులిద్దరూ ఆగ్రహంతో ఊగిపోయారు.


ఇదేంటీరా దేవుడా..ఈ పిల్లాడి వయస్సేంటి..ఈ పిల్ల వయస్సేంటీ ఈ వయస్సులో ఇదేం వైపరీత్యం..చిన్నపిల్లలు కూడా ఇలా తయారైతే ఇక ఏంటీ పరిస్థితి అని తలకొట్టుకున్నారు. ఇది మరోసారి జరక్కుండా ఆ పిల్లాడికి భయం అంటే ఏమిటో తెలియాలని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వాళ్లు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఏమని చెప్పాలో కూడా తెలీక..జరిగిన విషయం చెప్పారు. అది విన్న పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ పిల్లాడిని తిట్టాలా?కొట్టాలా? ఏమని చెప్పాలి? అనుకుంటూ కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.


కాకపోతే సదరు బాలుడు కావటంతో ఈ కేసును జువనైల్ కోర్టుకు అప్పగించారు. ఈ మేరకు ఆ పిల్లవాడిని మంగళవారం జువనైల్ కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.కాగా..లైంగిక వేధింపులే కాదు లైంగిక దాడులు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజులు వారాలుగా వరుస అత్యాచారాలు..అనంతరం హత్యలు జరిగిన ఘోరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.UPలో అత్యాచార కేసులు యూపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. నేరాలకు అడ్డాగా యూపీ తయారైంది. ఆడవారిపై జరిగే నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.హత్రాస్ ఘటన వెలుగులోకి రావడంతో ఎక్కువైన అత్యాచారాలు..హత్యల పరంపర.. అలాగే కొనసాగుతోంది. ఇక తాజాగా చిన్న పిల్లలు సైతం ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటంపై ఆడపుట్టుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *