భార్యే భర్తకు నెలవారీ భరణం ఇవ్వాలని తీర్పునిచ్చిన కోర్టు..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Uttar Pradesh court : ఉత్తరప్రదేశ్ లోని ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్యే భర్తకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది.ఈ భరణాన్ని ఆ భర్త ఖర్చుల కోసం ప్రతీ నెలా ఇవ్వాలని తీర్పునిచ్చంది. దీంతో సదరు భార్య షాక్ అయ్యింది.


సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే భర్త నుంచి భార్యకు భరణం ఇప్పిస్తారు. కానీ యూపీ ఫ్యామిలీ కోర్టులో సీన్ రివర్స్ అయ్యింది. ఓ కేసులో భార్యే సదరు భర్తకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది.


రేప్ కేసులో 22రోజుల్లోనే తీర్పు.. తుది శ్వాస వరకూ జైళ్లోనే


వివరాల్లోకి వెళితే చాలా సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇరువురూ విడివిడిగా జీవిస్తున్నారు. అయితే హిందూ వివాహ చట్టం-1955 కింద తన భార్య నుంచి భరణం ఇప్పించాలంటూ ఆమె భర్త 2013లో కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.


ఈ పిటీషన్ ప అప్పటి నుంచి విచారణ కొనసాగుతున్న క్రమంలో తాజాగా గురువారం (అక్టోబర్ 22,2020)న యూపీలోని ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు వెలువరిస్తూ..ప్రభుత్వ నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఆ భార్య ప్రతినెలా భర్తకు భరణం కింద రూ.1000 చెల్లించాలని ఆదేశించింది.ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయడంతో ఆమెకు ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.12,000 పెన్షన్ వస్తోంది. దీంతో ఆమె తన భర్తకు ఖర్చులకు గాను ప్రతినెలా రూ.1000 చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించటం సంచలనం కలిగించింది.

Related Tags :

Related Posts :