రెండేళ్ల క్రితం చనిపోయిన టీచర్ కు జీతం,ఇంక్రిమెంట్: విద్యాశాఖ నిర్వాకం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్‌లో చనిపోయిన టీచర్ కు జీతం ఇస్తున్న విద్యాశాఖ నిర్వాకం బైటపడింది. రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం మృతిచెందిన ఉపాధ్యాయునికి విద్యాశాఖ ఇంకా జీతం ఇస్తూనే ఉంది. అతని ఎకౌంట్ లోకి జీతం జమచేస్తునే ఉంది. అంతేకాదండోయ్..రెండేళ్ల క్రితం చనిపోయిన ఆ టీచర్ కు జీతం ఇవ్వటమే కాదు..ఏకంగా ఇంక్రిమెంట్ కూడా ఇచ్చింది విద్యాశాఖ. ఇదీ విద్యాశాఖ అధికారుల నిర్వాకం. ఇది విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌ దృష్టికి చేరటంతో పెద్ద కలకలమే చెలరేగింది. దీంతో తమ ఘనకార్యాన్ని కప్పిపుచ్చుకునే యత్నాలు చేస్తున్నారు. ఇదంతా అబద్దమని నమ్మించటానికి నానా తంటాలు పడుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. అరవింద్ కుమార్ అనే మాస్టారు 2015, న‌వంబ‌ర్ 5 న పీలీభీత్‌లోని బిల్సాండా బ్లాక్ వద్ద గవర్నమెంట్ స్కూల్లో నియమితులయ్యారు. ఆ తరువాత సంవత్సరానికి అంటే 2016, మే 22న అనారోగ్యంతో చనిపోయారు. దీంతో అరవింద్ కు చాలా సర్వీస్ ఉండగానే చనిపోవటంతో..అతని భార్య వందన తన వార‌స‌త్వ ఉద్యోగం కోసం ప్రైమరీ విద్యాశాఖ అధికారి దేవేంద్ర స్వరూప్‌ను వద్దకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా దేవేంద్ర అరవింద్ జీతం గురించి జిల్లా ప్రైమరీ విద్యాశాఖాధికారిని వాకబు చేయగా.. 2016 నుంచి కూడా అరవింద్ కుమార్ టీచర్ పేరున ఉన్న ఎకౌంట్ కు జీతం జమ అవుతోందని తేలింది.ఇంక్రిమెంట్ కూడా జమ అయ్యిందనీ తేలింది. దీంతో జిల్లా ప్రైమరీ విద్యాశాఖాధికారి దేవేంద్ర స్వరూప్ దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు.

దీనిపై దేవేంద్ర స్వరూప్ మాట్లాడుతూ.. ఆ టీచర్ మరణించినప్పటికీ, అతని ఎకౌంటక లోకి జీతం జమ అవుతోందనీ..అతని స్థానంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అత‌ని భార్య వచ్చిన సందర్భంగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందనీ దీనిపై నిర్లక్ష్యం వహించినవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామని అలాగే చనిపోయిన అరవింద్ కుమార్ స్థానంలో అతని భార్యకు ఆ ఉద్యోగం వచ్చేలా చూస్తామని తెలిపారు.

Related Posts