uttar pradesh transgender Anushka Chaubey from  chhath pooja for ram mandir in ayodhya

దేశం శాంతిగా ఉండాలి : రామ మందిర నిర్మాణం కోసం హిజ్రా వ్రత దీక్ష

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రామ మందిర నిర్మాణం వివాదంపై  సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే దీనిపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మేధావులు..విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రామమందిర నిర్మాణం జరగాలనీ ఆకాంక్షిస్తున్న కొందరు మొక్కులు కూడా మొక్కుకుంటున్నారు.  ఈ క్రమంలో యూపీలోని బలియాకు చెందిన హిజ్రా కిన్నార్ అనుష్క చౌబే అన్నూ వత్ర దీక్ష చేపట్టారు. 

రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నుంచి తీర్పు రావాలని ఎంతో కఠినంగా ఉండే ఛట్ వ్రతాన్ని అనుష్క చౌబే చేస్తున్నారు. దీనిపై అనుష్క చౌబే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో ఉన్న రామ మందిర నిర్మాణంపై కొనసాగుతున్న కేసుపై తీర్పు త్వరగా రావాలనీ..నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అందుకే ఎంతో కఠినమైన ఈ ఛట్ వ్రత దీక్షను చేపట్టానని తెలిపారు. 

తీర్పు అనంతరం ఆలయ నిర్మాణం శాంతి పూర్వకంగా జరగాలని..భారతదేశంలో శాంతి వర్థిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు. భారతదేశంలో ఎన్నో  మతాల వారూ ఉన్నారు. వారందరూ శాంతితో జీవించాలనీ.. ఛట్ వ్రతంలోని ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. దేశంలో కులమతాల  రాజకీయాలు ఉండకూడదనీ..అటువంటి తారతమ్యాలు మనుష్యులమధ్య ఉండకూడదని తాను కోరుకుంటున్నానన్నారు.
ఛట్ వ్రత దీక్షలో భాగంగా 36 గంటల పాటు అత్యంత కఠోర ఉపవాస దీక్ష చేపట్టిన హిజ్రా  ఆదివారం (నవంబర్ 3) పూర్తి చేయనున్నారు అనుష్క చౌబే.

ఛట్ పూజా విశేషాలు
హిందూ ధర్మాలలో నిర్వహించుకునే ప్రాచీన పూజా విధానాలలో ఛట్ పూజ ఒకటి. కార్తీక మాసంలో జరుపుకునే ఈ ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు.భూమ్మీద వున్న జీవరాశులన్నింటికీ మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికీ కృతజ్ఞతలు మహిళలు ఈ పూజను చేస్తారు. ఈ ఛట్ పూజను చాలావరకు భారతదేశంలో ఉత్తరాదిన వున్న ప్రదేశాలలో ఎక్కువగా జరుపుకుంటారు. కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ఇష్టమన మాసం. ఈ నెలలో వ్రతం చేపట్టి..కోరికలు కోరితే శివకేశవులు తీరుస్తారని హిందూవులు నమ్ముతుంటారు. ఈ క్రమంలో హిజ్రా రామ మందిర నిర్మాణం కోసం వ్రతం చేపట్టారు. 

Related Posts