భారత్ మానవత్వం : నేపాల్ బాలిక కోసం తెరుచుకున్న పితోరాగఢ్‌ బ్రిడ్జ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

uttarakhand: సరిహద్దు విషయంలో భారత్ పై కయ్యం పెట్టుకుంటున్న నేపాల్ విషయంలో భారత్ మానవత్వాన్ని చూపెట్టింది. సరిహద్దు వివాదాన్ని తెరపైకి తెచ్చి కయ్యానికి సై అంటున్న నేపాల్ భారత్‌ మాత్రం తన సహజమైన పెద్ద మనస్సును చూపింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నేపాలీ బాలికకి తక్షణ వైద్య సాయం అందించేందుకు అంతర్జాతీయ మార్గాన్ని తెరిచి మానవత్వాన్ని చాటుకుంది. ఉత్తరాఖండ్‌ పితోరాగఢ్‌ జిల్లాలోని అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జిని భారత్‌ సోమవారం (సెప్టెంబర్ 28,2020) అర్ధరాత్రి అరగంట పాటు తెరిచింది.


పొత్తి కడుపులో గడ్డలతో బాధపడుతున్న నేపాలీ బాలిక ఉత్తరాఖండ్‌ లోని పితోరాగఢ్‌ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె ఉత్తరాఖండ్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఈ వంతెన ఒక్కటే మార్గం కావడంతో.. నేపాల్ ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న తమ బాలిక ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని భారత్‌ను అభ్యర్థించింది. దీనిపై మానవత్వంతో ఆలోచించిన ధార్చులా డిప్యూటీ కలెక్టర్ అరగంట పాటు వంతెనను తెరిచి ఉంచేందుకు అనుమతించారు. ఈ విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ ధృవీకరించారు.


ఆ అమ్మాయితో పాటు ఇరువైపుల నుంచి వచ్చిన జనం కూడా వంతెన దాటారు. తమ బిడ్డ చికిత్స కోసం సరిహద్దు వెంబడి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని నేపాల్ అధికారులను బాలిక తల్లి కోరారు. ఈ విషయాన్ని బాలిక తల్లి రేవతి తెలిపారు. కాగా..భారత్ భూభాగాన్ని తమ దేశంలో కలిపేస్తూ నేపాల్ ప్రభుత్వం ఒంటిపోకడగా చట్టం చేసిన విషయం తెలిసిందే. భారత్-నేపాల్ సరిహద్దు వివాదం విషయంలో భారత్ పై నేపాల్ దుశ్చర్యలకు పాల్పడుతోంది. రెండు నెలల క్రితం భారత్‌కు చెందిన ముగ్గురు పుశువుల కాపరులపై నేపాల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన ఘటనలో ఓ వక్తి గాయపడగా, మరో ఇద్దరు సురక్షితంగా బైటపడ్డారు.


ఇలా పలు సందర్భాల్లో నేపాల్ భారత్ మీద కాలు కయ్యానికి దువ్వుతోంది. కానీ భారత్ మాత్రం నేపాల్ విషయంలో మానవత్వం చాటుకుంది. ఇండో – నేపాల్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నా భారత్ శాంతిగా సమన్వయంతో వ్యవహరిస్తూ మానవత్వం చాటుకుంటోంది.మరోవైపు శ్రీరాముడు కూడా తమవాడే అంటూ ఆ దేశ ప్రధాని కేపి శర్మ ప్రకటించి వివాదాన్ని కూడా సృష్టించిన విషయం తెలిసిందే.

Related Posts