అమ్మాయికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు, యూపీకి తీసుకెళ్లి మరో నలుగురితో కలసి గ్యాంప్ రేప్ చేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజి యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరాఖండ్ లోని ఉథమ్ సింగ్ నగర్ జిల్లా ఖాతిమా పట్టణంలో నివసించే 20 ఏళ్ళ యువతి జూలై9 న కాలేజీ లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగి వెళుతోంది.

దారిలో ఆమెకు ఒక హోటల్ వద్ద తెలిసిన ఇద్దరు వ్యక్తులు పలకరించి ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. తెలిసిన వారు అనే ఉద్దేశ్యంతో ఆమె కూల్ డ్రింక్ తాగింది. అప్పటికే వారు అందులో మత్తుమందు కలిపి ఉండటం వల్ల… తాగిన కొద్ది సేపటికే ఆ యువతి స్పృహ కోల్పోయింది.

అక్కడి నుంచి ఆమెను వారు ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లాకు తీసుకువెళ్లారు. ఈ లోగా స్పృహ వచ్చిన యువతి వారినుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. పెనుగులాడింది. కానీ కుదరలేదు. అక్కడ మరో నలుగురు వారితో కలిశారు.

ఆరుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఫిలిబిత్ జిల్లాలో ఒక నిర్జన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు.వెళ్తూ వెళ్తూ ఈ దారుణాన్ని పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. కొద్ది సేపటికిఆమె శరీరంలో శక్తి నంతటిని కూడ దీసుకుని రోడ్డు మీదకు వచ్చింది. అది ఏ ఊరో తెలుసుకుని ఆ ఊరిలో ఉన్నతమ బంధువుల ఇంటికి స్దానికుల సహాయంతో చేరుకుంది.

వారి సహకారంతో తన కుటుంబాన్ని చేరుకుని ఖాతిమా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ముగ్గురుని ఆమె గుర్తించగలిగింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ .354, 376 డి, 506 ల కింద కేసు నమోదు చేసి నిందితులకోసం గాలిస్తున్నట్లు స్టేషన్ ఎస్ఐ సంజయ్ పాథక్ చెప్పారు.

Related Posts