Home » హిందుస్తాన్ అనని వాళ్లతో కేసీఆర్ దోస్తీ : యూపీ సీఎం యోగీ
Published
2 months agoon
By
bheemrajyogi adityanath comments : హిందుస్తాన్ అనని వాళ్లతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ విమర్శించారు. కేసీఆర్ కు పేదలపై ప్రేమ లేదన్నారు. నిజాం అరాచకాలు మరిచిపోదామా? అన్నారు. శనివారం గ్రేటర్ లో యోగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లలో నిరుద్యోగం పెరిగిందన్నారు.
వరద సాయం పంపిణీలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. వరద బాధితులకు నేరుగా అకౌంట్ లో నగదు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఎంఐఎంతో కలిసి ప్రజలకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందన్నారు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా? ప్రశ్నించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్లలో తెలంగాణకు 15 లక్షల ఇళ్లు ఇచ్చామని తెలిపారు. కరోనాను మోడీ సమర్థవంతంగా నియంత్రించారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి అని కోరారు.